Home /News /telangana /

FIRE IN THE NALLAMALA FOREST IN TELANGANA BN

నల్లమల అడవుల్లో మళ్లీ మంటలు.. అధికారులు ఆ పని చేయడంతో...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నల్లమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఏలా జరిగిందనే దానిపై కారణాలు తెలియాల్సి ఉంది.

    నల్లమల అడవుల్లో అగ్నికీలలు మరోసారి ఎగిసిపడ్డాయి. గత నెలలోనూ నల్లమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా గురువారం రాత్రి శ్రీశైలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖరేశ్వర సమీప అడవుల్లో మంటలు వ్యాపించాయి. అయితే ఈ మంటలు ఏలా అంటుకున్నాయన్న దానిపై స్పష్టత లేదు. అటవీ ప్రాంతంలో సంభవించిన మంటలను సున్నిపెంటకు చెందిన అటవీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. వాస్తవానికి నల్లమల అటవీ ప్రాంతంలో అప్పుడప్పుడు అగ్నిప్రమాదం చోటుచేసుకుంటుంది. శ్రీశైలానికి వచ్చిపోయే పర్యాటకులు సిగరేట్ కాల్చడం వంటి చర్యల వల్ల అగ్నిప్రమాదం జరిగేదని అధికారులు చెప్పేవారు. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో పర్యాటకులెవరూ రావడం లేదు. అయినా అగ్నిప్రమాదం జరుగుతుండడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వేసవికాలం నేపథ్యంలో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Nallamala, Nallamala forest, Srisailam, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు