పెద్దపల్లి జిల్లాలో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి రాయ్‌చూర్ వెళ్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లు తీసుకెళ్తున్న రైలులో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లాలోని చీకురాయి వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి మంటలు రావడంతో.. లోకో పైలట్ రైలును అక్కడే నిలిపివేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపశాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అంటుకున్న ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి.. మిగతా ఆక్సిజన్ ట్యాంకర్లు ఉన్న బోగీలతో విడదీశారు. అనంతరం దానిని దూరంగా తరలించారు. కాసేపటికి అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయి.
అయితే మంటలు చెలరేగిన ట్యాంకర్‌పై విద్యుత్ లైన్ ఉండటంతో.. సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అయితే మంటలు వెంటనే అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే మంటలు ఎలా చెలరేగాయనే అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రమాద గల కారణాలను రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.