నాంపల్లి ఎంజే మార్కెట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భవనంలో నిల్వ ఉంచిన పీవీసి పైపులు దగ్ధం అవడం వల్లే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

news18-telugu
Updated: October 12, 2019, 7:08 AM IST
నాంపల్లి ఎంజే మార్కెట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ నాంపల్లిలోని ఎంజే మార్కెట్‌లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.మార్కెట్‌ను ఆనుకుని ఉన్న ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేయడంతో.. హుటాహుటిన అక్కడికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భవనంలో నిల్వ ఉంచిన పీవీసి పైపులు దగ్ధం అవడం వల్లే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>