జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అగ్నిప్రమాదం (Fire accident in metpally) జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు (Kalvakuntla vidyasagar rao) ఇంట్లో మంటలు చెలరేగాయి. సిలిండర్ లీక్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆయన భార్య గాయపడ్డారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో మెట్పల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయన భార్య సరోజ, ఇతర కుటుంబ సభ్యులు కలిసి పిండి వంటలు చేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఎల్పీజీ సిలిండర్ నుంచి గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఎమ్మెల్యే భార్య సరోజకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగిన తర్వాత సకాలంలో స్పందించడంతో ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఎమ్మెల్యే సతీమణిని హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి షిప్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు స్పల్ప గాయాలు మినహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Sangareddy : సమాధి దొంగలు.. సమాధి తవ్వి , పుర్రె, ఎముకలు ఎత్తుకెళ్లారు.. ఎందుకోమరి...!
Adilabad : సంక్రాంతికి ముందే తెలంగాణ జిల్లాలో కోడి పందాలు.. ఎక్కడంటే...?
ప్రమాద సమయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గత నెలలో అయ్యప్ప మాలధారణ స్వీకరించారు. మెట్పల్లిలోని స్థానిక అయ్యప్ప దేవాలయంలో 34వ సారి స్వామి మాల ధరించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రస్తుతం కోరుట్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. అప్పటి నుంచి ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. ఆయన ఇంట్లో అగ్నిప్రమాదం జరగడంతో మంత్రులు, ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. తాము క్షేమంగానే ఉన్నామని ఎవరూ ఆందోళన చెందాల్సిన లేదని ఆయన చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Hyderabad, Telangana, Trs