సికింద్రాబాద్ గణేష్ మండపంలో మంటలు... దీపం వెలిగిస్తూ...

గణేష్ మండపాన్ని అందంగా అలంకరించిన డెకరేషన్ వస్త్రాలకు మంటలు అంటుకున్నాయి.

news18-telugu
Updated: September 4, 2019, 8:39 AM IST
సికింద్రాబాద్ గణేష్ మండపంలో మంటలు... దీపం వెలిగిస్తూ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సికింద్రాబాద్ గణేష్ మండపంలో అగ్నిప్రమాదం సంభవించింది. మల్కాజ్‌గిరిలోని మైత్రి నివాస్ అనే అపార్ట్‌మెంట్‌లో స్థానికులు వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాత్రి దీపం వెలిగిస్తుండగా అనుకోకుండా మంటలు ఎగిసి మండపమంతా వ్యాపించాయి. గణేష్ మండపాన్ని అందంగా అలంకరించిన డెకరేషన్ వస్త్రాలకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అపార్ట్‌మెంట్ వాసులు అప్రమత్తతతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు ఎగిసి పడటంతో... స్థానికులు మంటలు ఆపే ప్రయత్నం చేయగా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ఫైరింజన్‌ను పిలిపించి మంటల్ని అదుపు చేశారు.ఈ ఘటనలో నాలుగు కార్లు, పది బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మండపం మొత్తం కాలిపోయింది.

 

First published: September 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>