మేడ్చల్ రైల్వేస్టేషన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న సూపర్ ఫాస్ట్ ట్రైన్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓ బోగి నుంచి మరో బోగికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమయిన ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన బోగీలో ప్రయాణికులెవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు ఆరిపోయినా రైలు బోగి కిటికీల్లోంచి దట్టమైన పొగలు బయటకు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident