జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం... పేలిన బాయిలర్... ఇద్దరు మృతి

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం (File from twitter - credit - ANI)

పారిశ్రామిక వాడ అయిన జీడిమెట్లలో తరచూ ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి స్థానికులను ఒకింత భయపెడుతున్నాయి. అసలు పరిశ్రమల్లో సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 • Share this:
  హైదరాబాద్ అవుట్‌స్కర్ట్స్‌లోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడి నాసెన్స్‌ కెమికల్ ఫ్యాక్టరీలో అప్పుడప్పుడే తెల్లారుతున్న సమయంలో బాయిలర్ పేలిపోయింది. పెద్ద శబ్దం వచ్చింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అవి ఫ్యాక్టరీ అంతా వ్యాపించాయి. కార్మికులు తలో దిక్కుకూ పరుగులు పెట్టారు. అయినప్పటికీ ఇద్దరు కార్మికులు తప్పించుకోలేకపోయారు. వారు చనిపోయారు. మరికొందరికి మంటల వల్ల తీవ్రమైన గాయాలు అయ్యాయి. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

  ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. పెద్ద ఎత్తున వస్తున్న మంటల్ని చూసి స్థానికులు... ఏం జరిగింది... ఏమైంది అని టెన్షన్ పడ్డారు. కాసేపటికే... ఫైరింజన్ సిబ్బంది వచ్చి.... మంటల్ని అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే... మంటలు అదుపులోకి వచ్చినా.... బాయిలర్‌లో ఇంకా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. అందులోంచీ పొగ బాగా వస్తోంది. ఆ ఏరియాలో ఇది తీవ్ర కలకలం రేపుతోంది.

  ఇది కూడా చదవండి: Leopard: టీ గార్డెన్‌లోకి వచ్చిన చిరుతపులి.. పరుగులు తీసిన జనం.. ఆ తర్వాత

  అధికారులు అసలేం జరిగిందనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. త్వరలోనే రిపోర్ట్ ఇస్తామని అంటున్నారు. ఐతే... ఆ పరిశ్రమ చాలా పాతదైపోయిందనీ... అందుకే ఇలా జరిగిందని స్థానికులు అంటున్నారు. పాత పరిశ్రమలను తొలగించకుండా... అలాగే కంటిన్యూ చేస్తున్నారనీ... అందువల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: