హైదరాబాద్.. రాజేంద్ర నగర్‌లోని శాస్త్రిపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి... ఓ ప్లాస్టిక్ గోడౌన్‌లో రెండు DCM వాహనాలు కాలి బూడిదవుతున్నాయి. భారీ ఎత్తున పొగ, మంటలు ఎగసిపడుతున్నాయి. ఆల్రెడీ రంగంలోకి దిగిన అగ్ని మాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో గంటలోపు మంటల్ని అదుపులోకి తెస్తామని చెబుతున్నారు.
అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది అనేది తెలియలేదు. ప్రమాదం జరిగినప్పుడు గోడౌన్‌లో ఎవరూ లేరని చెబుతున్నారు. రెండు డీసీఎం వాహనాలు మాత్రం పూర్తిగా కాలిపోయినట్లే అంటున్నారు. మంటలు భారీ ఎత్తున వస్తుండటంతో... చుట్టు పక్కల వారిని అక్కడి నుంచి కాస్త దూరానికి పంపించారు.
హైదరాబాద్‌లో ఈ మధ్య జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏడాది కాలంలో 4 అగ్ని ప్రమాదాల్లో 28 మంది చనిపోయారు. సిటీలో ఫైర్ సేఫ్టీ సరిగా లేదని ఈ ఘటనలే చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Hyderabad, Telangana News