నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధాన జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో జల విద్యుత్ కేంద్రం వెలుపల ఉన్న ట్రాన్స్ ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అర్పేందుకు ప్రయత్నించారు. మంటలు సకాలంలో అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అధికారులు, అక్కడి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ఆకస్మాత్తుగా మంటలు ఎలా వచ్చాయనేది తెలియాల్సి ఉంది. ప్రమాద కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక, గతేడాది ఆగస్టులో శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్లో ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పెద్ద పెద్ద పేలుడు శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. పవర్ హౌస్ లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో ఏడుగురు టీఎస్ జెన్కో ఉద్యోగులు, ఇద్దరు అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది అక్కడే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వారంతా చనిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Nagarjuna sagar