మాస్కులేని వ్యక్తికి మద్యం అమ్మినందుకు రూ.5వేల జరిమానా.. ఎక్కడంటే..

సిరిసిల్ల పట్టణంలోని మల్లికార్జున వైన్స్‌కు మాస్కు ధరించకుండా వచ్చిన ఓ వ్యక్తికి మద్యం విక్రయించారు. దీంతో పురపాలక కమిషనర్ సమ్మయ్య రూ.5వేల జరిమానా విధించారు.

news18-telugu
Updated: May 8, 2020, 5:38 PM IST
మాస్కులేని వ్యక్తికి మద్యం అమ్మినందుకు రూ.5వేల జరిమానా.. ఎక్కడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. అయితే రెండు రోజుల క్రితమే తెలంగాణలో లాక్‌డౌన్‌కు కొంతమేర సడలింపులు ఇచ్చారు. సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలను సైతం తెరిచారు. అయితే మద్యం అమ్మకాలు చేపట్టే సమయంలో కరోనా నివారణ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించింది. లేనిపక్షంలో జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరించింది. అయితే సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో మాస్కులేని వ్యక్తికి మద్యం విక్రయించినందుకు జరిమానా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల పట్టణంలోని మల్లికార్జున వైన్స్‌కు మాస్కు ధరించకుండా వచ్చిన ఓ వ్యక్తికి మద్యం విక్రయించారు. దీంతో పురపాలక కమిషనర్ సమ్మయ్య రూ.5వేల జరిమానా విధించారు. మద్యం దుకాణాల దగ్గర భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి మార్గదర్శకాలతో ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
First published: May 8, 2020, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading