Home /News /telangana /

FIDAA DIRECTOR SEKHAR KAMMULA SUPPORTS SAVE NALLAMALA FOREST CAMPAIGN SK

సేవ్ నల్లమల...ప్రభుత్వాన్ని తప్పుబట్టిన శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల (Sourcw: Twitter)

శేఖర్ కమ్ముల (Sourcw: Twitter)

నల్లమలలో యురేనియం తవ్వకాలను ఫేస్‌బుక్, ట్విటర్ వేదికగా తప్పుబట్టిన ఆయన...ఆ పోస్ట్‌ని సీఎం కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.

  నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యవహారంపై దుమారం రేగుతోంది. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ ఫారెస్టులో యురేనియం తవ్వకాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అడ్వయిజరీ కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంపై ఆదివాసీలు మండిపడుతున్నారు. సేవ్ నల్లమల పేరుతో ఇప్పటికే ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలపై విపక్ష పార్టీలు సైతం మండిపడుతున్నాయి. యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐతే ఈ ఉద్యమానికి సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల సైతం మద్దతు తెలిపారు.

  నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీని వలన పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎంతో మంది చెంచులు, అంతరించిపోతున్న పులులకు ఆవాసంగా ఉన్న నల్లమల సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణా దాని ఉపనదులు పూర్తిగా కలుషితమవుతాయి. ఇప్పటికే చాలా మంది కేన్సర్ బారినపడ్డారు. యురేనియం తవ్వకాలతో కేన్సర్ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేయకూడదు.
  శేఖర్ కమ్ముల, సినీ దర్శకుడు


  ప్రభుత్వం వెంటనే స్పందించి యురేనియం తవ్వకాలపై పునరాలోచించాలని కోరారు శేఖర్ కమ్ముల. నల్లమల అడవులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను ఫేస్‌బుక్, ట్విటర్ వేదికగా తప్పుబట్టిన ఆయన...ఆ పోస్ట్‌ని సీఎం కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపిన శేఖర్ కమ్ములను ప్రజాసంఘాలు, గిరిజన సంఘాల నేతలు అభినందించారు.
  First published:

  Tags: Nallamala forest, Sekhar kammula, Telangana, Tollywood, Uranium

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు