హోమ్ /వార్తలు /తెలంగాణ /

Fever survey : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరోసారి ఇంటింటికి ఫీవర్ సర్వే.. కరోనా కిట్స్,

Fever survey : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరోసారి ఇంటింటికి ఫీవర్ సర్వే.. కరోనా కిట్స్,

వీరితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,107కి చేరింది. మహమ్మారి బారి నుంచి నిన్న 2,421 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 11,681 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

వీరితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,107కి చేరింది. మహమ్మారి బారి నుంచి నిన్న 2,421 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 11,681 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Fever survey : కరోనా థర్డ్ వేవ్ ఉధృతిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వలే ఇంటింటికి జ్వర సర్వేను నిర్వహించాలని నిర్ణయించింది.

కరోనా పరిస్థితులపై సమావేశమైన మంత్రుల బృందం పలు అంశాలను చర్చించింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన అంశాలపై సమీక్ష జరిపింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జ్వరం, దగ్గుతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మరోసారి జ్వర సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుండే ఆ సర్వే కూడా కొనసాగాలని నిర్ణయించారు.

కోవిడ్ కట్టడికి కొత్త వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోగికీ 200 రూపాయల విలువ చేసే డైట్ ప్లాన్ అందించనుంది. ఇంటింటికీ ఆరోగ్యం అనే పేరుతో సర్వే నిర్వహించనుంది. ఇందు కోసం ప్రత్యేక బృందాలు అన్ని గ్రామాల్లో పర్యటిస్తాయి. రోజుకు 25ఇళ్లను సందర్శిస్తాయి. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ కోవిడ్ కిట్ అందిస్తారు.

మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కోవిడ్ ఓపీ సర్వీసులు ప్రారంభిస్తారు. కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ కొనసాగించనున్నారు. అలాగే వ్యాక్సినేషన్‌ను మరింత వేగంగా నిర్వహించనున్నారు.

Khammam : తెలంగాణలో స్వర్గీయ ఎన్టీఆర్ మరో భారీ విగ్రహం.. జూనియర్ ఎన్టీఆర్ చేత ఆవిష్కరణ.. ఎక్కడంటే..

ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, ఆయాసం ఉంటే దగ్గర్లోని దవాఖానాల్లో చేర్పించడం తోపాటు ఆసుపత్రి అవసరం లేని వారికి హోం ఐసోలేషన్ కిట్ ఇవ్వనున్నారు.. ఇందుకోసం 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు సమకూర్చుకున్నామని చెప్పారు.. వీటిని పి హెచ్ సి స్థాయి పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు... ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు సీఎస్ సోమేష్ కుమార్ ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Siddipet : మొన్న పెన్సిల్.. నేడు సైకిల్ .. పోలీస్ స్టేషన్‌లకు క్యూ కడుతున్న పిల్లలు... వారిలో అంత ధైర్యం ఎలా...?

జేహెచ్ ఎం సి పరిధిలోని అన్ని బస్తీ దవాఖానల్లో టెస్టింగ్, కిట్ల పంపిణీ కొనసాగుతుందని, కరోనా తగ్గే వరకు ఆదివారం 2 గంటల వరకు అన్ని బస్తీ దవాఖానలు సేవలు అందిస్తాయని వారు తెలిపారు..

First published:

Tags: Corona, Hyderabad

ఉత్తమ కథలు