హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS NEWS : బుల్లెట్ బండి జంటకు సన్మానం..డాన్స్‌తో ఫిదా అవుతున్న ఫ్యాన్స్...

TS NEWS : బుల్లెట్ బండి జంటకు సన్మానం..డాన్స్‌తో ఫిదా అవుతున్న ఫ్యాన్స్...

బుల్లెట్ బండి వధువుకు బంపర్ ఆఫర్

బుల్లెట్ బండి వధువుకు బంపర్ ఆఫర్

TS NEWS : బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేసిన నూతన జంటకు స్థానికులు ఘన సన్మానం చేశారు. స్థానిక గోదావరి ఖనికి చెందిన అనేక సంఘాలు, యువకులు వారికి శుభాకాంక్షలు చెబుతూ సత్కరించారు.

బుల్లెట్ బండి పాటకు గోదావరి ఖనికి చెందిన నూతన వధువు డాన్స్ చేసి ఇరగదీసిన సంగతి తెలిసిందే..ఆమె డాన్స్‌కు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ చానల్స్ ఫిదా అయ్యాయి..దీంతో ఏ చానల్ చూసిన ఆమె డాన్స్ కనిపించిన పరిస్థితి. అలాంటి జంటకు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు. తమ ప్రాంతానికి చెందిన వారు కావడంతో సన్మానాలు, సత్కారలతో ముంచెత్తుతున్నారు.

కొంత జంట కావడంతో వారికి తోచిన విధంగా విషెస్ చెబుతూ ఆత్మీయరాగాన్ని పంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే గోదావరి ఖనిలో పలు ఫౌండేషన్‌లతో పాటు ఆల్‌ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యర్వయంలో బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేసిన వధువు సాయి శ్రీతోపాటు వరుడు అశోక్‌లను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

కాగా ఈ జంటకు తాజాగా వివాహం జరిగిన నేపథ్యంలోనే తెలంగాణలోని పాలమూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్ రాసిన పాటకు సింగర్ మోహన భోగరాజు పాడిన పాటకు నవ వధువు డాన్స్ చేయడంతో ఆ పాటతో పాటు డాన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒరిజనల్ సింగర్ చేసిన డాన్స్ కంటే సాయి శ్రీ చేసిన డాన్స్‌కు ఫాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఆమె కేవలం ఆ తన స్టేటస్‌లో పెట్టుకున్న వీడియో మొత్తం సోషల్ మీడియాలో లక్షల మంది వ్యూయర్‌షిప్ సాధించింది.


ఇక సాయి శ్రీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా..వరుడు అశోక్ హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో ఉద్యోగం చేస్తున్నాడు..ఈ క్రమంలోనే వధువు తండ్రి రాము ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యాక్షుడిగా పని చేస్తుండడంతో వారు నూతన జంటకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఇతర సంఘాల నేతలు పాల్గోని నూతన జంటను ఆశీర్వాదించారు.

First published:

ఉత్తమ కథలు