• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • FED UP WITH CORRUPTION FARMER CARRIES PETROL BOTTLE TO TAHSILDAR OFFICE IN CM KCRS OWN DISTRICT SIDDIPET BA

పెట్రోల్ బాటిల్‌తో రైతు హల్‌చల్... కేసీఆర్ సొంత జిల్లాలోనే..

పెట్రోల్ బాటిల్‌తో రైతు హల్‌చల్... కేసీఆర్ సొంత జిల్లాలోనే..

పెట్రోల్ బాటిల్‌తో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతు

సీఎం కేసీఆర్ ఇస్తున్న పింఛను డబ్బులతో బతుకుతున్న తనను రూ.25వేలు లంచం అడుగుతున్నారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

  • Share this:
    ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా మారని అధికారుల తీరు ఎక్కడ చూసినా లంచగొండి మహమ్మారి జనాన్ని పట్టిపీడిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలోనే ఓ రైతు పెట్రోల్ బాటిల్‌తో తహసీల్దార్ ఆఫీసుకు వచ్చాడు. సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు పెట్రోల్ బాటిల్ తీసుకుని రావడం కలకలం రేగింది. తాను ఓ రైతునని ఎన్నో రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై అసహనం తో పెట్రోల్ బాటిల్ పట్టుకొని కార్యాలయంలో తనపై పోసుకునేందుకు యత్నించాడు. అయితే, అక్కడ ఉన్న వారు ఆ రైతును అడ్డుకున్నారు. అనంతరం బాధితుడు మీడియాతో మాట్లాడుతూ తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి తన భూ సమస్య కోసం పరిష్కరించాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగానని చెప్పారు. అయినా లాభం లేకపోయిందని, లంచం లేనిదే పని కాని దుస్థితి సమాజంలో నెలకొందని రైతు వాపోయాడు.

    ‘నాది మిద్దెపల్లి. భార్య చనిపోయింది. కొడుక్కి ఉద్యోగం లేదు. నా జాగ నేనే దున్నుతున్నా. ఇప్పుడు ఎమ్మార్వో, వీఆర్వో వచ్చి నీకు భూమి లేదంటే ఎట్లా. 1975లో పటేల్ భూమి ఇచ్చాడు. సర్టిఫికెట్ కూడా ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది నా ఆధీనంలోనే ఉంది. రైతు బంధు వస్తుంది. అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మార్వో వచ్చి, వీఆర్వోను పట్టుకుని నన్నిలా రూ.25వేలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి తేవాలి. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి. నేను బతకడానికే తిప్పలు పడుతున్నా. కేసీఆర్ నెలకి రూ.2000 పింఛను ఇస్తుంటే దాంతో బతుకుతున్నా. ఆ మస్కూరాయన డబ్బులు అడుతున్నాడు. అడుగుతూనే ఉన్నారు. ప్రూఫ్ చూపిస్తా’ అని రైతు తెలిపాడు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు