Adilabad Tiger: అమ్మో పులి...ఆదిలాబాద్ జిల్లాలో బెబ్బులి కలకలం...

పులి భయంతో పంట చేలలో పత్తి, కంది పంటలను వదిలేశామని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: February 17, 2020, 11:03 PM IST
Adilabad Tiger: అమ్మో పులి...ఆదిలాబాద్ జిల్లాలో బెబ్బులి కలకలం...
పులి (ప్రతీకాత్మకచిత్రం)
  • Share this:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి కదలికలు మొదలయ్యాయి. పులి సంచారంతో పల్లె ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు పులి పుశువులపై దాడి చేసి హతమార్చింది. పులి బారి నుండి తమను, తమ పశువులను కాపాడాలని శివారు గ్రామ ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు. పులి సంచారం తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శివారు గ్రామాల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఇందూరు పల్లి, ఘోల్లఘట్, తాంసి (కె) గ్రామాలు, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోనూ పులి ఆనవాళ్లు కనిపించాయి. దీంతో శివారు గ్రామాల ప్రజలు పంట చేలకు వెళ్ళేందుకు జంకుతున్నారు. అక్కడ విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, ప్రభుత్వ సిబ్బంది వచ్చిపోవడానికి భయపడుతున్నారు. భీంపూర్ మండలంలోని ఇందూర్ పల్లి, తాంసి(కె) గ్రామాల సమీపంలో పులి పశువుల పై దాడి చేసి హతమార్చింది. వరుస దాడుల్లో రెండు ఆవులు మృత్యు వాత పడ్డాయి. వరుస ఘటనలు గ్రామ ప్రజలకు కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నాయి. పులి భయం తో గత వారం రోజులుగా రైతులు పంట చేలకు వెళ్లకుండా భయం భయంగా గడుపుతున్నారు. గ్రామస్థులు డప్పులు, కర్రలతో గుంపుగా తిరుగుతున్నారు.

పులి భయంతో పంట చేలలో పత్తి, కంది పంటలను వదిలేశామని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పులి సంచరిస్తున్నట్లు అనవాళ్ళను గుర్తించారు. పులి సంచరిస్తున్నట్లు సిసి కెమెరాల్లో కదలికలు కూడా కనిపించాయి. అయితే పొరుగున ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి పులుల వచ్చే అవకాశం ఉంది. కాగా పులి సంచరిస్తున్న సమాచారం తెలుసుకున్న అటవీ అధికారి డా. ప్రభాకర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థులకు పులి నుంచి ఎలాంటి హాని జరుగకుండా చూస్తామని భరోసా కల్పించారు.
Published by: Krishna Adithya
First published: February 17, 2020, 11:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading