గిరిజన దాడి : అటవీ సిబ్బందిపై గిరిజన మహిళల దాడి, చెట్టుకు కట్టెసీ చీపుర్లు, కర్రలతో బీభత్సం

అటవీ అదికారులపై దాడి చేస్తున్న మహిళలు,

గిరిజన దాడి : పోడు భూముల్లో హరితహారం చెట్లను నాటేందుకు వెళుతున్న .. వెళ్లిన అటవీ శాఖ సిబ్బందిని అడ్డుకుని స్థానిక గిరిజన మహిళలు దాడి చేశారు. ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారులను కర్రలు, చీపుర్లతో కొట్టారు.

  • Share this:
పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీ శాఖ సిబ్బందిని అడ్డుకుని స్థానిక గిరిజన మహిళలు దాడి చేశారు. ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారులను కర్రలు, చీపుర్లతో కొట్టారు. కాగా ఓ బీట్ ఆఫీసర్‌ను చెట్టుకు కట్టెసి మరి చితకబాదారు. అంతకుముందే దాడిలో బీట్ అధికారులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్, ఒక అస్టిస్టెంట్‌కు గాయాలయ్యాయి,గాయపడిన వారిలో మహిళ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోడు భూముల్లో హరితహారం వద్దు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం రేంజి డీ కొత్తూరు చింతగుప్ప వద్ద 27 హెక్టార్ల పోడు భూములను గత నెలన్నర రోజులుగా చదును చేసి చేసి మొక్కలు నాటేందుకు అటసీ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం చింతగుప్పకు వాహనాలు వచ్చేందుకు రహదారిని సిద్ధం చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ,అసిస్టేంట్ను ఆదివాసీ మహిళలు అడ్డుకుని మందుగా దాడిచేశారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ అధికారులు రా పడ్డారు. వీరిలో రాజే్‌శ్ అనే బీట్ ఆఫీసర్‌ను తాడుతో చెట్టుకు కట్టెశారు. అనంతరం కర్రలతో కొట్టారు. దాడి అనంతరం గ్రామ సర్పంచ్‌ కృష్ణ, మరియు సిబ్బంది బ్రతిమిలాడటంతో వారిని విడిచిపెట్టారు. సీఎ్‌ఫవో భీమా, డీఎ్‌ఫఓ రంజిత్‌నాయక్‌ బాధిత సిబ్బందితో మాట్లాడి వివరాలను తెలుసుకుని ప్రాథమిక చికిత్స అనంతరం అటవీసిబ్బంది పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
చేశారు.మందు ప్లాన్ ప్రకారమే దాడి.

గ్రామస్థులు, మహిళలు ఒక పథకం ప్రకారమే తమపై దాడికి పాల్పడ్డారని గాయాలపాలైన ఎఫ్‌భీఓలు ఉన్నతాధికారులకు తెలిపారు. కర్రలు దగ్గర పెట్టుకొని, వెళ్లగానే వారిపై దాడి చేయడంతోపాటు, దుర్భాషలాడారన్నారు. తాము కూడా ఎదురు తిరిగితే మగవాళ్లు సైతం తమపై దాడి చేసేందుకు వెనుకాడేవారు కారని, కానీ వారు దెబ్బలకు ఓర్చుకొని మరీ సంయమనం పాటించామని ఆవేదన వ్యక్తం చేశారు.
Published by:yveerash yveerash
First published: