Home /News /telangana /

FATHER WHO KILLED HIS SON AND HANGED HIM IN A FAMILY QUARREL IN NIRMAL DISTRICT SNR ADB

Nirmal:బిడ్డను కొట్టి చెట్టుకు ఉరివేసి చంపిన తండ్రి..అటుపై తాను కూడా..

(కొడుకుని చంపి తండ్రి సూసైడ్)

(కొడుకుని చంపి తండ్రి సూసైడ్)

OMG:నాలుగేళ్ల కాపురంలోనే భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధల కారణంగా ఏడాదిన్నర వయసు కూడా లేని బిడ్డను చంపి..తాను ఆత్మహత్య చేసుకున్నాడో తండ్రి. నిర్మల్ జిల్లాలో జరిగిన రెండు చావులకు కుటుంబ కలహాలే కారణమని సూసైడ్ నోట్ దొరకడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  (K.Lenin,News18,Adilabad)
  ఇంటి నుంచి వెళ్లిన తండ్రి, కొడుకులు వారం రోజుల తర్వాత అడవిలో చెట్లకు వేలాడుతూ కుళ్లిపోయిన శవాలుగా కనిపించారు. తండ్రి కొడుకుల మృతికి కారణాలు ఏమై ఉంటాయని పోలీసులు ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మల్ (Nirmal)జిల్లాకు చెందిన 11నెలల కొడుకుని తల్లి దగ్గర నుంచి తండ్రి బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా ఆడవికి తీసుకెళ్లి ఇటుకలతో కొడుకుని కొట్టాడు. అటుపై బిడ్డను చెట్టుకు వేలాడదీసి ఉరివేశాడు. తర్వాత తాను కూడా అదే చెట్ట కొమ్మకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. విషాదకరమైన ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్(జి) (Narsapur (G) నసీరాబాద్(Nasirabad)గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. తునికాకులు కోయడానికి మహిళలు అడవికిలోకి వెళ్లిన సమయంలో చెట్లకు వేలాడుతూ రెండు శవాలు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు చనిపోయిన పసివాడు, చంపిన వ్యక్తి ఇద్దరూ తండ్రి,కొడుకులుగా గుర్తించారు. మృతులు లోకేశ్వరం(Lokeshwaram)మండలం కనకాపూర్(Kanakapur)గ్రామానికి చెందిన బరిడే వినేష్(Baride Vinesh), అతని కుమారుడు అభిరామ్‌(Abhiram)‌గా నిర్ధారించారు. వినేష్‌కి నాలుగేళ్ల క్రితమే కుభీర్(Kubir)మండలంలోని సాంవ్లీ(Samvli)గ్రామానికి చెందిన సరిత(Sarita)తో వివాహం జరిగింది. వినేష్, సరిత దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. జీవితాన్ని హ్యాపీగా గడపాల్సిన వయసులో ప్రాణాలు తీసుకోవాల్సినంత ఖర్మ ఏం వచ్చిందని పోలీసులు కూపీ లాగారు.

  బిడ్డ ఉసురు తీసిన తండ్రి..
  మొదట కొడుకుకు ఉరి వేసి, ఆ తర్వాత తాను ఉరి వేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తండ్రి, కొడుకుల బలవన్మరణానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. తమ ఆత్మహత్యలకు భార్య సరిత, బామ్మర్ధి వేధింపులే కారణమంటూ వినేష్ రాసిన సూసైడ్ నోట్ ఘటన స్థలంలో లభించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్య, బామ్మర్దిలకు సమాచారం అందించి విచారిస్తున్నట్లుగా నిర్మల్ డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. బరిడే వినేష్, అతని కుమారుడు అభిరామ్, భార్య సరిత ముగ్గురు బైక్‌పై అత్తగారి ఊరైన సాంవ్లీ గ్రామానికి ఈనెల 20వ తేదిన వెళ్లారు. మరుసటి రోజు వినేష్‌ తన కొడుకు అభిరామ్‌ని తీసుకొని దుకాణానికి వెళదామని బైక్‌పై ఎక్కించుకెళ్లాడు.

  భార్య, బామ్మర్ధిపై కోపంతో..
  సాయంత్రం అయినా తిరిగి ఇంటికి చేరుకోలేదు. కంగారుపడిన భార్య సరిత వినేష్ స్వగ్రామమైన కనకపూర్‌కి వెళ్లారేమోనని ఆరా తీశారు. అక్కడికి కూడా చేరలేదని తేలడంతో కుభీర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంట ఫోన్ కూడా లేకపోవడంతో అప్పటి నుండి వెతికినా తండ్రీకొడుకుల జాడ తెలియలేదు. బుధవారం రోజున అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించారని మహిళలు చెప్పడంతో మిస్సింగ్ కేసు సూసైడ్‌గా తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్యభర్తల మధ్య విభేదాల కారణంగా ఓ పసివాడ్ని కన్నతండ్రి చంపడం, అటుపై తాను బలవన్మణం చేసుకున్న ఘటన స్థానికంగా అందర్ని బాధించింది.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Man commit to suicide, Nirmal district

  తదుపరి వార్తలు