హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gadwala : భార్యపై కోపంతో సంవత్సరం కొడుక్కి పురుగుల మందు తాగించిన తండ్రి.

Gadwala : భార్యపై కోపంతో సంవత్సరం కొడుక్కి పురుగుల మందు తాగించిన తండ్రి.

3. అత‌ని వ‌య‌సు 35 ఏళ్ల వ‌య‌సు ఉంది. డిసెంబ‌ర్ 19న ఓ అమ్మాయి. బ్యాడ్మింట‌న్ ఆడుతుండ‌గా బ్యాట్ రాకెట్ తీగ‌లు తెగిపోయాయి. ష‌టిల్ రాకెట్ తీగ‌లు స‌రి చేసుకోవ‌డానికి షాపుల కోసం బ‌య‌ట‌కు వెళ్లింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

3. అత‌ని వ‌య‌సు 35 ఏళ్ల వ‌య‌సు ఉంది. డిసెంబ‌ర్ 19న ఓ అమ్మాయి. బ్యాడ్మింట‌న్ ఆడుతుండ‌గా బ్యాట్ రాకెట్ తీగ‌లు తెగిపోయాయి. ష‌టిల్ రాకెట్ తీగ‌లు స‌రి చేసుకోవ‌డానికి షాపుల కోసం బ‌య‌ట‌కు వెళ్లింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Gadwala : జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ( Father killed one year old son ) భార్య కాపురానికి రాలేదనే కోపంతో ఓ తండ్రి కన్న కొడుక్కి విషమిచ్చి కిరాతకంగా చంపాడు. ఈ విషాద సంఘటన కేటీ దొడ్డి మండలం నందిన్నె గ్రామంలో చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...

  భార్య భర్తల వివాదాల మధ్య పిల్లలు నలిగిపోతున్నారు. అంతేకాదు చివరకు వారి ప్రాణాలు సైతం తీస్తున్న సంఘటనలు ఇటివల ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇలా భార్యకు కాపురానికి రాలేదనే కొపంతో ఓ భర్త కిరాతంగా వ్యవహరించాడు. ఆమె మీద ఉన్న కోపం తన కన్న కొడుకు మీద చూయించాడు.

  పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా నందిన్నె గ్రామానికి చెందిన కురువ కర్రెప్పకు కుచినెర్ల గ్రామానికి చెందిన నరసమ్మతో వివాహమైంది. వీరికి ఏడాది బాబు భరత్ ఉన్నాడు. అయితే.. వీరిద్దరి మధ్య ఇటివల ఘర్షనలు చోటు చేసుకుంటున్నాయి. Father killed one year old son ) తరచు ఘర్షణలు అవుతుండడంతో భర్త కర్రెప్ప దారుణంగా ఆలోచించాడు.. తన భార్య ఇంట్లో ఉండగా కొడుకును తన వెంట తీసుకొని వచ్చి చిన్నారికి పురుగుల మందు తాగించాడు.. అనంతరం భార్య దగ్గర వదిలి వెళ్లాడు. ( Father killed one year old son ) దీంతో చిన్నారి సృహతప్పి పడిపోవడంతో..

  Sirivennela Seetharama Sastry : ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటు.. సీఎం సంతాపం


  Karimnagar : అధికార పార్టీకి కోవర్టుల భయం.. తెరవెనుక చక్రం తిప్పుతున్న ఈటల


  Bandi sanjay : ఎలా.. ధాన్యం కోనుగోలు కేంద్రాలు మూస్తారో... మేము చూస్తాం...!


  ఇది గమనించిన కుటుంబ సభ్యులు బాబును రాయచూర్ హాస్పిటల్ తరలించారు.. కాగా అక్కడ చికిత్స పొందుతూ చిన్న భరత్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన తర్వాత కుమారుడిని పొట్టనబెట్టుకున్న భర్తపై భార్య ఫిర్యాదు మేరకు కర్రెప్పపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  ఇటివల నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ నగరంలో ఇలాంటీ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలకు పిల్లలు అడ్డువస్తున్నారని భావించడంతో పాటు ఇతర కుటుంబ సంబంధాల్లో పిల్లలను బలి చేస్తున్నారు. ఇలా నగరంలోని సూరారంలో ఓ మూడేళ్ల బాలుడిని ఓ తల్లి స్వయంగా విపరీతంగా కొట్టి ఇంట్లో ఉన్న వైర్లతో ఉరివేసింది. అయితే తిరిగి తానే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇలా చిన్నపిల్లలను విపరీతంగా కొడుతూ తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించే తండ్రుల సంఖ్య కూడా ఇటివల పెరుగుతోంది.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime, Gadwal

  ఉత్తమ కథలు