• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • FATHER IN LAW KILLED HIS SON IN LAW BY HARRASING HIS DAUGTER IN NIZAMABAD VRY NZB

Nizamabad : కూతురిని వేధించాడని అల్లుడిని చంపిన మామా..శవాన్ని నదీజలాల్లోకి విసిరిన నిందితుడు..!

Nizamabad : కూతురిని వేధించాడని అల్లుడిని చంపిన మామా..

Nizamabad : తన కూతురిని వేధిస్తున్నందుకు ఏకంగా తన అల్లుడినే కడతేర్చాడు ఓ మామ... కూతురు కన్నీళ్లతో వేధింపులపై తండ్రికి ఫిర్యాదు చేయడంతో..తట్టుకోలేని తండ్రి ఆ కూతురికి చెప్పకుండా అల్లుడిని ఖతం చేసి కాలువలో పడేశాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఇంటికి చేరాడు...!

  • Share this:
కూతురు అల్లుడు క‌లిసి ఆనందంగా ఉండాల‌ని అమ్మ‌యి త‌ల్లిదండ్రులు కోరుకుంటారు.. పిల్ల‌ల ఆనందం కొసం ఏమైన చేసేందుకు వేనుకాడరు తల్లిదండ్రులు. పిల్లల సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు అనుకుంటారు.. వారికి ఏమైనా అయితే...తట్టుకోలేరు..దీంతో ఏ చిన్న పంచాయితీ వచ్చినా వాళ్ల ముందు వాలి సమస్యను పరిష్కరిస్తారు..అల్లుడు ఎంత హింసించినా..వేధింపులకు గురి చేసినా... సర్దుబాటు ధోరణిలోనే వెళతారు..

కాని తాజాగా జరిగిన ఓ సంఘటనలో కూతురుపై అల్లుడి వేధింపులను తట్టుకోలేని మామా మాత్రం కఠినంగా వ్వవహరించాడు..తన కూతురు..నాన్నా అల్లుడు తీవ్రంగా వేధిస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకుని చెప్పడంతో తట్టుకోలేని తండ్రి ఆ అల్లుడిని ఖతం చేశాడు.. అదికూడా తన కూతురికి తెలియకుండా.. కుట్ర చేసి హతమార్చిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని గంగారం గ్రామానికి చెందిన నాగరాజు, కామారెడ్డి జిల్లా నిజాంసాగ‌ర్ మండ‌లం హాసన్ పల్లి గ్రామానికి చెందిన పసుల సాయిలు కూతురుతో వివాహం జరిగింది..అయితే అల్లుడు కూతురు మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు మకాం మార్చారు. అయితే నాగరాజు తన భార్యను వేధింపులకు గురి చేశాడు. దీంతో నాగరాజు భార్య తన తండ్రి సాయిలు ఫోన్‌లో వివరించింది..

ఈ క్రమంలోనే సాయులు తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ వెళ్లి తన కూతురు వేధింపులకు కారణమైన అల్లుడితోపాటు గత నెల 27న హైదరాబాద్ నుండి స్వగ్రామానికి తీసుకువెళ్లాడు. అయితే తన గ్రామానికి సమీపంలోని హసన్ పల్లి గేటు వద్ద అల్లుడి దింపి మిగతా కుటుంబసభ్యులను ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి చేరుకున్న అనంతరం తిరిగి ఓ బైక్‌పై అల్లుడి వద్దకు చేరుకున్నాడు. అల్లుడిని తీసుకుని ఆరెడు గ్రామ సమీపంలోని నిజాం సాగర్ బ్యాక్ వాటర్‌కు చేరుకున్నాడు..

అక్కడి వెళ్లిన తర్వాత ఒంటరిగా ఉన్న నాగరాజుపై సాయిలు దాడికి దిగాడు..పక్కనే ఉన్న రాయితో తలమీద కొట్టాడు..దీంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయిన నాగరాజును సాగర్ బ్యాక్ వాటర్‌లోకి తెప్పమీద తీసుకువెళ్లాడు . కొంత దూరం లోపలికి వెళ్లాక చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత నదిలో పడవేసి తాపిగా ఇంటికి చేరుకున్నాడు...అయితే ఇంట్లో వాళ్లకు కూడా అనుమానం రాకుండా అల్లుడిని హైదరాబాద్ పంపించానని చెప్పాడు. దీంతో అందరు నమ్మారు.

ఇక నాగరాజును శవాన్ని చూసిన రేపల్లె స్థానిక వీఆర్ఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు..దీంతో ముందుగా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనంతరం మృతుడి వద్ద దొరికిన ఆధారాలను బట్టి నాగరాజు తల్లిదండ్రులకు సమాచారం అందించారు..దీంతో నాగరాజు మృతిపై తల్లిదండ్రులు సైతం అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు తమ స్టైల్లో విచారణ జరిపారు..సాయిలును అనుమానించి విచారించారు..ఈ క్రమంలో అల్లుడిని తానే చంపినట్టు ఒప్పుకున్నాడు..కూతురును వేధింపులకు గురి చేయడం వల్లే హత్య చేశానని అంగీకరించాడు.
Published by:yveerash yveerash
First published: