Home /News /telangana /

FATHER COMMITS SUICIDE AFTER SON DEATH IN KHAMMAM VRY

Khammam :విషాదం...! కొడుకు మృతిని తట్టుకోలేని తండ్రి... ఖననం చేసిన చోటే ఉరి...!

hanging

hanging

Khammam : కన్న కొడుకు మీద ఆశలు పెట్టుకున్న తండ్రి ఆ కొడుకు హఠాత్తుగా మృతి చెందడంతో ఆ తండ్రి కూడా కొడుకు దారిలోనే వెళ్లాడు.. కొడుకును ఖననం చేసిన చోటే ఆ.. తండ్రికూడా ఉరి వేసుకున్న సంఘటన ఖమ్మంలో వెలుగు చూసింది.

    తాము చదువుకుంటున్న స్కూళ్లోనే భర్త్‌ డే వేడుకలు చేసుకున్నందుకు ఇద్దరి ప్రాణాలు కొల్పోయారు... టీచర్లుగా విద్యార్థి చేసిన పనికి టీచర్లు దండించగా..ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా వారి భాద్యతగా కొడుకునే మందలించారు. ఇలా పుట్టిన రోజువేడుకలను కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వని టీచర్లు, తల్లిదండ్రుల మందలింపుల మధ్య ఆ విద్యార్థి మనస్థాపానికి గురయ్యాడు. తాను చేసింది పెద్ద తప్పుగా భావించి .. తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. అయితే కొడుకును తీవ్రంగా మందలించినందుకు తండ్రికూడా పశ్చాతాప పడ్డాడు. తాను మందలించడం వల్లే కొడుకును కొల్పోయానని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో ఆ తండ్రి కూడా కొడుకును ఖననం చేసిన చోటే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కొల్పోయాడు.

    వివరాల్లోకి వెళితే...ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సాయి భానుప్రకాశ్ అనే పదవ తరగతి విద్యార్థి.. ఇటివల తన పుట్టిన రోజు వేడుకలను తాను చదువుతున్న హర్వేస్ట్ స్కూళ్లో తన స్నేహితుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నాడు. అందరు కలిసి ఆనందంగా గడిపాడు. ప్రస్తుత సంస్కృతికి అనుగుణంగా వేడుకలను నిర్వహించుకున్నాడు. అయితే స్కూలు సంప్రదాయాలకు విరుద్దంగా సాయి భర్త్‌ డే వేడుకలను జరుపుకోవడం స్కూలు యజమాన్యానికి తెలిసింది. ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజి ద్వారా విషయాన్ని చూసిన యాజమాన్యం సాయి తల్లిదండ్రులను పిలిచి మందలించారు. అంతటితో ఆగకుండా వారం రోజుల పాటు స్కూలు నుండి సస్పెండ్ చేశారు.

    TRS@Delhi : ఢిల్లీకి చేరిన మంత్రుల బృందం.. మూడు రోజులు అక్కడే మకాం..ఇసారి ఏం జరుగుతుందో..?


    అయితే తన కొడుకు చేసిన పనికి తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న సాయిని వాళ్లుకూడ తీవ్రంగా మందలించారు. ఓవైపు టీచర్లు, ఆతర్వత తల్లిదండ్రులు కూడా తీవ్రంగా మందలించడంతో తట్టుకోలేని సాయి ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే అదృష్టవశాత్తు సాయిని చూసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాని పరిస్థితి విషమించడంతో.. ఆ విద్యార్థి చికిత్స పొందుతూ... ఈ నెల 16న మృతి చెందాడు. దీంతో శనివారం ఉదయం స్వగ్రామంలో సాయికి అంత్యక్రియలు నిర్వహించారు.

    Hyderabad weather : నగరంలో చలి పులి.. రికార్డు స్థాయిలో చలి తీవ్రత.. నగరంలో యెల్లో అలర్ట్...


    అయితే కొడుకు మృతిని తట్టుకోలేని సాయి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.తన భవిష్యత్‌పై కళలు కన్న కొడుకు కళ్లముందే కాటికి వెళ్లడంతో ఆ తండ్రి కూడా ఉండలేకపోయాడు. దీంతో కొడుకు అంత్యక్రియలు జరిగిన తర్వాత సాయి తండ్రి రాంబాబు ఇంటినుండి బయటకు వెళ్లాడు.. కొడుకును ఖననం చేసిన చోటే చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు వదిలాడు. దీంతో సత్తుపల్లిలో తీవ్ర విషాదచాయలు నెలకొన్నాయి.తండ్రి కొడుకులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడంతో మిగిలిన కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Khammam, Man commit to suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు