Home /News /telangana /

Hyderabad : మద్యం మత్తులో తండ్రి కర్కశం.. పిల్లాడిని కిందపడేసి దారుణం..

Hyderabad : మద్యం మత్తులో తండ్రి కర్కశం.. పిల్లాడిని కిందపడేసి దారుణం..

father hit son

father hit son

Hyderabad : చిన్న పిల్లాడిని పట్టుకుని విపరీతంగా కొట్టడంతో పాటు దాన్ని వీడియో కూడా తీయించిన ( Father beats his son Brutally ) ఓ తండ్రి పైశాచికత్వం హైదరాబాద్‌లో వెలుగు చూసింది.

    కన్న తల్లిదండ్రులు పిల్లల పట్ల కర్కశంగా వ్వహరిస్తున్న సంఘటనలు షాకింగ్‌కు గురి చేస్తున్నాయి.( Father beats his son Brutally ) కొంతమంది మానసిక పరిస్థితి బాగాలేక చేస్తుంటే మరికొంతమంది మద్యం మత్తులో పిల్లలపై దారుణానికి దిగుతున్నారు. దీంతో తమకు ఏం జరుగుతుందో తెలియని చిన్నారులు తల్లిదండ్రులు కొట్టే దెబ్బలకు విలవిల్లాడుతున్నారు. ( Father beats his son Brutally ) గతంలో ఇలాంటీ కేసులు ఎన్ని బయటపడ్డా వారిపై చర్యలు నామమాత్రం కావడంతో తల్లిదండ్రుల్లో కనీస అవగాహన లేకుండా పోతుంది. దీంతో తమకు పుట్టిన సంతానాన్ని తామే కొట్టి చంపుకునే పరిస్థితి దాపురిస్తోంది.

    ఇలా తాజాగా ఓ తండ్రి ఎనిమిదేళ్ల పిల్లగాడికి మద్యం మత్తులో నరకం చూపించాడు. డాడీ, డాడీ అని మొత్తుకుంటున్నా కనికరం చూపించకుండా కట్టెతో గొడ్డును బాదినట్టు కింద పడేసి కొట్టాడు. ( Father beats his son Brutally ) ఇది చాలదన్నట్టుగా తాను కొడుతున్న దృశ్యాలను బాలుడి చెల్లెలు చేత వీడియో కూడా తీయించాడు. అలా చాలా సేపు తన అన్నను కొడుతుండడంతో తండ్రికి ఎదురు చెప్పలేని చిన్నారీ పాప సైతం వద్దు డాడీ అని ఏడుస్తున్నా ఆ తండ్రి హృదయం మాత్రం కరగలేదు.. ఇలా చాలా సేపు పిల్లాడిని కొడుతూనే ఉన్నాడు.

    Harish rao : రెండు డోసుల తర్వాతే... ఆరు నెలలకు బూస్టర్ డోస్


    వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్​ లాల్​ దర్జాజ ప్రాంతంలో అశోక్, జిజాబాయి దంపతులు నివాసం ఉంటున్నారు. జిజాబాయి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. ( Father beats his son Brutally ) అశోక్​ మద్యానికి బానిసయ్యాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అల్లరి చేస్తున్నాడని.. ఇరుగుపొరుగువారు తండ్రికి ఫిర్యాదు చేశారు. ( Father beats his son Brutally ) అప్పటికే మద్యం మత్తులో ఉన్న తండ్రి.. ఆగ్రహానికి గురై తన కుమారుడిని చితకబాదాడు. ఇంట్లో తల్లి లేని సమయంలో పసివాడిని కర్రతో దారుణంగా కొట్టాడు. ఆ బాలుడిని కొట్టడమే గాక.. కర్కశంగా తండ్రి తాను తన కుమారుడిని కొడుతున్న వీడియో తీయమని బాలుడి చెల్లెలికి చెప్పాడు. ( Father beats his son Brutally ) తన అన్నను తండ్రి కొట్టడం చూస్తూ.. ఓవైపు ఏడుస్తూ.. మరోవైపు.. అన్నయ్యను కొట్టొద్దు నాన్నా అంటూ.. ఆ పాప వీడియో తీసింది.

    Kamareddy : కామారెడ్డిలో విషాదం.. ఒకేసారి ఇద్దరికి గుండెపోటు.. పేషంట్‌తో పాటు వైద్యుడు కూడా ప్రాణాలు విడిచాడు.


    అయితే బయటికి పోయిన పిల్లాడి తల్లి కాసేపటికి ఇంటికొచ్చింది. అప్పటికి కూడా పిల్లాడిని కొట్టడం చూసిన తల్లి మనసు చలించిపోయింది. ఆ బాలుడి ఒంటిపై దెబ్బలు చూసి తానే తల్లడిల్లింది. చిన్నపిల్లాడని కూడా చూడకుండా కొట్టిన తండ్రిపై తీవ్రంగా మందలించింది. ( Father beats his son Brutally ) ఆ తర్వాత ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించింది. అయినా.. తన భర్త చేసిన పనికి ఇంకా కొపం మాత్రం చల్లారాలేదు.. పిల్లలపై ఇంత కర్కశంగా వ్వవహరించిన భర్తకు తగిని బుద్ది చెప్పించాలని నేరుగా చత్రీనాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ( Father beats his son Brutally ) దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ పిల్లాడిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తండ్రి కర్కశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

    కాగా ఇలాంటీ సంఘటనే గతంలో కూడా ఓ పిల్లాడిని నేలకేసి కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. మానసిక పరిస్థితి బాగాలేని తండ్రి నాలుగు సంవత్సరాల పిల్లాడిని నేలకొట్టి కొట్టడంతో పాటు తీవ్రంగా కొట్టడం అప్పుడు తల్లి కూడా అక్కడే ఉండి చూస్తూ ఉండడం కూడా పలు విమర్శలకు తావిచ్చింది.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు