Home /News /telangana /

FARMERS WILL DECIDE THE PRICE FOR THEIR AGRICULTURE PRODUCT HYDERABAD STARTUP ONE BASKET BETTER PROFITS TO FARMERS BK SK

రైతుల పంటకు రైతులే ధర నిర్ణయించవచ్చు.. హైదరాబాద్ స్టార్టప్ అదిరిపోయే ఐడియా


(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

రైతుల కోసం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఒక న‌యా ఐడియాతో ముందుకొచ్చాడు. రైతులు తాము పండిన కూర‌గాయాలు త‌మ పొలం నుంచే అమ్ముకోవడంతో పాటు తమ పంటకు రైతులే ధర నిర్ణయించే వెసులుబాటు కల్పిస్తున్నాడు.

  (బాలకృష్ణ, న్యూస్ 18 ప్రతినిధి)

  మన దేశంలో రైతుల కష్టాలు అన్నీ కావు. దుక్కి దున్నేది మొదలు.. పంట చేతికొచ్చి.. దానిని మార్కెట్లో అమ్మే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎన్ని సవాళ్లు ఎదురైనా.. ఆరుగాలం కష్టపడి.. పంటను పండిస్తారు. తీరా చేతికొచ్చాక.. సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో.. చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రయోజనాలు కల్పిస్తామని.. ఎన్నో కొత్త కొత్త యాప్‌లు వస్తున్నాయి. ఆర్గ‌ానిక్ కూర‌గాయల (Organic Vegetables)  పేరుతో మార్కెట్లో జ‌రుగుతున్న బిజినెస్.. ఇప్పుడు లాభాల పంట‌పండిస్తోంది. అయితే ఇలాంటి యాప్‌లతో కార్పొరేట్ కంపెనీలు లాభాలు గ‌డిస్తోన్నాయి కానీ పంట‌లు పండిచే రైతు మాత్రం అలానే ఉండిపోతున్నాడు. ఇలాంటి రైతుల కోసం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఒక న‌యా ఐడియాతో ముందుకొచ్చాడు. రైతులు తాము పండిన కూర‌గాయాలు త‌మ పొలం నుంచే అమ్ముకోవడంతో పాటు తమ పంటకు రైతులే ధర నిర్ణయించే వెసులుబాటు కల్పిస్తున్నాడు.

  CM KCR vs Centre : తెలంగాణకు షాకిచ్చిన కేంద్రం.. బడ్జెట్ అప్పుల్లో రూ.19వేల కోట్లు కోత

  హైద‌రాబాద్‌ (Hyderabad)కు చెందిన మ‌ధుసూదన్ రెడ్డి స‌ల్లా ఈ విప్లవాత్మకమైన ఐడియాతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.  మద్దతు ధరలపై రైతులకు భరోసా కల్పిస్తున్నారు.  2008లో ఐజిక్ సెమీకండక్టర్‌ని స్థాపించిన మధుసూధన్కు టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. క్లిక్, హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తి కంపెనీని కూడా ప్రారంభించారు.  ఆ తర్వాత.. వ్య‌వ‌సాయంలో రైతుల‌కు ఏదైనా చేయాల‌నే ఉద్దేశంతో... స్మార్టన్ ఇండియా వ్యవస్థాపకుడు నర్సిరెడ్డి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన IIT ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థులతో క‌లిసి రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డే యాప్ వ‌న్ బాస్కెట్ (Onebasket) రూపొందించారు.  “మేము రైతుల పంట‌ను వాళ్లే నేరుగా వినియోగ‌దారుల‌కు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఇమేజ్-బేస్డ్ ట్రేస్బిలిటీని ఉపయోగించే Onebasket యాప్‌ను రూపొందించాం. దీని ద్వారా రైతులు నేరుగా వినియోగదారులకు తమ పంటను విక్రయించవచ్చు. ఈ యాప్ లో కేవ‌లం ఉత్ప‌త్తులు మాత్ర‌మే కాకుండా రైతులు పండించిన పంట‌కు సంబంధించిన మొత్తం స‌మాచారాన్ని తెలుసుకోవ‌చ్చు. రైతు ఏ విత్తనం రకం వాడారు? ఎన్ని రోజులు నిల్వ ఉంచారు అనే సమాచారాన్ని ప్యాకేజీపై ఉన్న క్యూర్ కోడ్‌ని స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. ఇది కస్టమర్‌లు నమ్మకంగా కొనుగోలు చేయడానికి, రైతుతో బంధాన్ని ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తుంది.'' అని మధుసూదన్ రెడ్డి న్యూస్18తో చెప్పారు.

  CM KCR : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ధరణి, భూసమస్యలపై 15 నుంచి రెవెన్యూ సదస్సులు..

  ప్ర‌స్తుతం ఈ యాప్ వివిధ ప్రాంతాల నుంచి అనేక రకాల బియ్యం, పప్పులు, కూర‌గాయాల‌ను వినియోగదారులకు అందిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహార ప్రాముఖ్యతపై వినియోగదారులకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను కూడా చేపడుతోంది. భారతదేశంలో అగ్రిటెక్ మార్కెట్ 2025 నాటికి $24 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని EY నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం, ఏప్రిల్ 2020 వరకు అగ్రిటెక్ కంపెనీలు $532 మిలియన్లను సేకరించాయి. ఇప్ప‌టికే ఈ రంగంలో అనేక స్టార్టప్‌లు ఉన్నాయి – DeHaat, గ్రామోఫోన్, టార్టాన్‌సెన్స్, ఇంటెల్లో ల్యాబ్స్, సెన్స్ గ్రాస్, మొదలైనవి ఉన్నాయి. ప్ర‌స్తుతం మ‌ధుసూధ‌న్ ప్రారంభించిన ఈ స్టార్టప్ ప్ర‌తి త్రైమాసికంలో విక్రయాల సంఖ్యను రెట్టింపు చేస్తూ.. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్ర‌స్తుతం ఈ యువ బృందం రైతులు తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించడానికి, ఎండ్-టు-ఎండ్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొని కృషి చేస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Farmers, Hyderabad, Telangana

  తదుపరి వార్తలు