హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఎమ్మార్వో కాళ్లపై పడిన రైతులు...న్యాయం కోసం కన్నీళ్లు

ఎమ్మార్వో కాళ్లపై పడిన రైతులు...న్యాయం కోసం కన్నీళ్లు

ఆ భూమి లేకపోతే బతకలేమని రోదించారు. ఐనా సదరు అధికారి ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ భూమి లేకపోతే బతకలేమని రోదించారు. ఐనా సదరు అధికారి ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ భూమి లేకపోతే బతకలేమని రోదించారు. ఐనా సదరు అధికారి ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  తెలంగాణలో రెవెన్యూ అధికారు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూప్రక్షాళ సమయంలో రికార్డులను తప్పుల తడకగా రూపొందించారని రైతులు ఆరోపిస్తున్నారు. పేద రైతుల నుంచి వేల వేలు లంచాలను వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఐనా తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని నిత్యం అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదు. న్యాయం కోసం బ్రతిమాలినా..కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నా కనికరిచండం లేదు. తాజాగా తెలంగాణలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది.

  చేవెళ్లలో ఇద్దరు రైతులు ఎమ్మార్వో కాళ్లు మొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూప్రక్షాళ సమయంలో తమ భూమిని వేరొకరి పేరున నమోదు చేశారు. ఆ భూమి తమదని ఎన్నో ఏళ్లుగా సాగుచేస్తున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. వీఆర్వో, ఎమ్మార్వోల చుట్టూ ప్రదక్షిణలు చేసి బ్రతిమాలినా వినలేదు. చివరకు ఎమ్మార్వో కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు రైతులు. ఆ భూమి లేకపోతే బతకలేమని రోదించారు. ఐనా సదరు అధికారి ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  రెవెన్యూ అధికారుల తీరుపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఆగ్రహంతో ఉంది. రైతులను ఇబ్బంది పెట్టడంతో పాటు పెద్ద మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నారని వారిపై ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఎంతో మంది అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడ్డారు. ఈ క్రమంలో రెవెన్యూ వ్యవస్థపై సంచలన నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది ప్రభుత్వం. బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైతులకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంటారని..వీఆర్వోల వ్యవస్థనే రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

  వీడియో ఇక్కడ చూడండి:

  First published:

  Tags: Farmers, Telangana, Telangana News

  ఉత్తమ కథలు