హోమ్ /వార్తలు /తెలంగాణ /

కారం జల్లి.. దాడి చేసి.. మహిళా అటవీ అధికారిపై దారుణం..

కారం జల్లి.. దాడి చేసి.. మహిళా అటవీ అధికారిపై దారుణం..

పోలీస్ స్టేషన్‌లో అటవీ అధికారి

పోలీస్ స్టేషన్‌లో అటవీ అధికారి

అటవీ అధికారులు ఆ చెట్లు నరికి వేయడంతో ఆగ్రహం చెందిన నలుగురు రైతులు అటవీ అధికారి, బీట్ ఆఫీసర్ స్వప్నపై దాడి చేశారు.

అటవీ అధికారులపై పోడు భూమిని సాగు చేస్తున్న రైతులు దాడి చేశారు. కారం పొడి జల్లి మరీ దాడికి పాల్పడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో పోడు భూమిలో గత కొంతకాలంగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ భూమిలో గత కొంతకాలంగా మామిడి మొక్కలను పెంచుతున్నారు. అటవీ అధికారులు ఆ చెట్లు నరికి వేయడంతో ఆగ్రహం చెందిన నలుగురు రైతులు అటవీ అధికారి, బీట్ ఆఫీసర్ స్వప్నపై దాడి చేశారు. స్వప్నకు స్వల్ప గాయాలు కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం

గత కొంత కాలంగా ఈ భూమి అటవీ శాఖ కు చెందిందని ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. దీంతో చర్యలు తీసుకుంటే కారం పొడి చల్లి తమపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదుతో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

First published:

Tags: Haritha haram, Telangana

ఉత్తమ కథలు