ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ...నాపదవికి రాజీనామాచేస్తా...ఎంపిటిసి

వరిధాన్యం కొనుగోళ్లు ఒక్కఅడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి అన్నాట్టుగా సాగుతోంది..

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గత నెలరోజులుగా పడిగాపులు కాస్తున్నారు..

  • Share this:
    నిజామాబాద్ జిల్లా: ఆరుగాలం పండించిన పంట వడగళ్ల వాన కారణంగా తడిసి ముద్దవుతోంది.. వరిధాన్యం కొనుగోళ్లు ఒక్కఅడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి అన్నాట్టుగా సాగుతోంది.. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో కొనుగోళ్లు మందకొడిగా సాగడంతో ఆ గ్రామ ఎంపిటిసి రాజీనామా చేస్తానని ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గత నెలరోజులుగా పడిగాపులు కాస్తున్నారు.. లారీల కొరత, హమాలీల కొరత, గన్నీ బ్యాగుల కొరత, ఇలా వివిధ కారణాలతో రోజూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.. ఇటు కరోనా అటు వడగండ్ల వాన రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు వేడుకుంటున్నారు..
    నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కావాలని మా గ్రామంలో కొనుగోళ్లు జరపడం లేదని ఎంపిటిసి కరుణాకర్రెడ్డి మండిపడ్డారు... అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.. మా రేకులపల్లి గ్రామంలో నలభై వేల బస్తాలు ధాన్యం ఉంటే ఇప్పటి వరకు నాలుగు వేల బస్తాలు మాత్రమే కొనుగోళ్లు జరిపారన్నారు.. నేనొక ప్రజాప్రతినిధిగా ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తున్నానని ఎంపీటీసీ అన్నారు. ఒకటి రెండు రోజుల్లోగా వరి ధాన్యం బస్తాలను కొనుగోలు చేయకపోయనట్లయితే వెంటనే రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.. మా గ్రామం పై ఎమ్మెల్యే కక్ష కట్టారని, గ్రామానికి లారీలు రాకుండా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని ఆయన అన్నారు.. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు... ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన కోరారు.. లేని పక్షంలో ఎంపిటిసి పదవికి రాజీనామా చేస్తానని రైతుల కోసం, రైతులు గెలిపించిన పదవి, రైతులకు ఉపయోగపడని ఈ పదవి అవసరం లేదని ఆయన అన్నారు..
    Published by:Venu Gopal
    First published: