హోమ్ /వార్తలు /తెలంగాణ /

కరోనా దెబ్బకు వాళ్ల లైఫ్ రోడ్డున పడింది..అయినా బిజినెస్‌ బాగుందంటా

కరోనా దెబ్బకు వాళ్ల లైఫ్ రోడ్డున పడింది..అయినా బిజినెస్‌ బాగుందంటా

రోడ్డు పక్కన తాజా కూరగాయలు

రోడ్డు పక్కన తాజా కూరగాయలు

Mahabubnagar: కరోనా వల్ల చాలా మంది ఇబ్బంది పడితే..ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కూరగాయలు సాగు చేసే రైతులు మాత్రం బాగుపడుతున్నారు. సాగు చేసిన కూరగాయల్ని పొలం పక్కనే ప్రధాన రహదారిపై షెడ్లలో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

(Rafisyed,Mahabubnagar,news18)

కరోనా దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిరు వ్యాపారులకు పూట గడవడం కష్టమైంది. ప్రజలంతా గుంపులుగా చేరవద్దని ఆంక్షలు విధించడమే ఇందుకు కారణమయ్యాయి. అయితే ఈ పరిస్థితి కొందరు రైతులకు మాత్రం కలిసి వచ్చింది. కరోనా ఆంక్షల వల్ల పండించిన కూరగాయలు అమ్ముడు పోక పోతే తీవ్రంగా నష్ట పోతామని గ్రహించిన ఈ రైతులు పొలానికి పక్కనే ఉన్న రోడ్డు వెంట విక్రయించడం ప్రారంభించారు. ఈవిధంగా పొలాల్లో పండించిన కూరగాయల్ని అక్కడే అమ్ముకుంటూ నాలుగు రూపాయలు సంపాధిస్తున్నారు. ఇలాంటి పంటలకు ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahabubnagar)కేరాఫ్ అడ్రస్‌గా మారింది. జిల్లాలోని క్రిస్థాన్‌పల్లి(Kristanpalli), నాగరకర్నూల్  జిల్లా (Nagercoil District), వెల్దండ( Veldanda)మండల కేంద్రానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు అయినా నలుగురికి కూరగాయల సాగే జీవనాధారం. పుట్ట శ్రీశైలం (Srisailam) అంజనమ్మ(Anjanamma), శేఖర్(Shekhar)మల్లమ్మ(Mallamma)చంద్రయ్య(Chandraya) అలివేలు శేఖర్ యాదమ్మ దంపతులు 20 ఎకరాల్లో ఏడాది పొడవునా కూరగాయలు సాగు చేస్తుంటారు. సాగు చేసిన కూరగాయల్ని వెల్దండ సమీపంలోని సొంత పొలాలకు పక్కనే ఉండే శ్రీశైలం -హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన పెట్టుకొని విక్రయిస్తున్నారు. కరోనా కారణంగా పండించిన కూరగాయల్ని మార్కెట్‌కి తీసుకెళ్లి అమ్మే పరిస్థితి లేకపోవడంతో ప్రయాణికులే లక్ష్యంగా జాతీయ రహదారి వెంట నాలుగురు కలసి  కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేశారు.

రైతుకు, వినియోగదారుడికి మేలు..

ఇదే రహదారిలో శ్రీశైలం, కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాల నుంచి రోజు హైదరాబాద్‌కు ఉద్యోగులు వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. అలా నిత్యం ప్రయాణాలు కొనసాగించే వారికి రైతులు రోడ్ల పక్కన అమ్ముతున్న కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్ముతున్న కూరగాయలు తాజాగా ఉండటం , మార్కెడట్‌ ధరలతో పోలిస్తే కాస్త తక్కువ ధరకే లభిస్తుండటంతో వీరి వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా వర్ధిల్లిస్తూ వస్తోంది. కరోనా రాకముందు ఈ ప్రాంతంలో కూరగాయలు పండించే రైతులు వాటిని అమ్ముకోవడానికి  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రము లోని క్రిస్థాన్ పల్లి, నగరకర్నూల్ జిల్లాలోని  కల్వకుర్తి, ఆమనగల్లు, వెల్దండ మండలల తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. దాని వల్ల రవాణా ఖర్చులు పెరగడం, కూరగాయలు ఎక్కువ ధరలకు విక్రయించాల్సి వచ్చేది. అంతే కాదు ఏజెంట్లకు కమీషన్ ఇవ్వడం, మార్కెట్ లో ఉండే పోటీ పడి అమ్ముకోవడం కారణంగా కనీసం గిట్టుబాటు ధర దొరికేది కాదని రైతులు వాపోతున్నారు. గతేడాది కిర సాగు చేస్తే కిలో రూ. 200 ధర పలికింది. ప్రస్తుతం రోజుకు రూ .4 వేల ఆదాయం వస్తుంది సగం పెట్టుబడి కి పోయినా భారీగా మిగులుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్ల పక్కనే కూరగాయల విక్రయం రైతుల ఆలోచనతో లాభాలు| Profits from the idea of ​​farmers selling vegetables along the roads in Mahabubnagar district
(రోడ్డు పక్కనే తాజా కూరగాయలు)

తక్కువ ధరకే తాజా కూరగాయలు. .

ముఖ్యంగా ఈవిధంగా రోడ్డు పక్కనే అమ్ముతున్న కూరగాయల్లో సేంద్రియ సాగు విధానంలో చేసిన వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి కనబర్చడంతో రైతులు సాగు విధానం మార్చుకుంటున్నారు. మిర్చి, టమాటా, వంకాయ, కాకర, గోకూర, దోసకాయ, చిక్కుడు, సొరకాయ, పొట్లకాయ, కిర, క్యారెట్, పాలకూర, తోటకూర, ఉండి కూర, పొన్నగంటి కూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకు కూరలతో పాటు కూరగాయల్ని సాగు చేస్తున్నారు. గతంలో పోలిస్తే ఈ తరహా వ్యాపారం, సాగు ఎంతో ఉపయోగకరంగా, తమకు కాస్త కుటుంబ సభ్యుల గురించి ఆలోచించుకునే విధంగా సమయం దొరుకుతోదని రైతు శేఖర్,యాదమ్మ దంపతులు చెబుతున్నారు. కరోనా నేర్పిన గుణపాఠంతో జీవితంలో నిరుత్సాహానికి లోనవకుండా మంచి ఆలోచనతో పనిచేస్తే అందులో కూడా సక్సెస్, సంతోషం రెండు దొరుకుతాయని రైతులు వాపోతున్నారు.

First published:

Tags: Mahabubnagar, Organic Farming

ఉత్తమ కథలు