Home /News /telangana /

FARMERS PROTEST FOR SUPPORTING PRICE FOR PADDY IN TELANGANA SU NZB

అన్నదాతకు గుండెకోత మిగిల్చిన సన్న రకం వరి సాగు.. పలు విధాలుగా రైతన్నల నిరసనలు

పంట తగల బెట్టి నిరసన తెలుపుతున్న ఓ రైతు

పంట తగల బెట్టి నిరసన తెలుపుతున్న ఓ రైతు

సన్న రకం వరి వేయాలని చెప్పిన ప్రభుత్వం మద్దతు ధర ఎందుకు ప్రకటించలేదని తెలంగాణలోని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ప్రకటించకుండా కొనుగోలు కేంద్రాలు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు.

    సన్న రకం వరి వేయాలని చెప్పిన ప్రభుత్వం మద్దతు ధర ఎందుకు ప్రకటించలేదని తెలంగాణలోని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ప్రకటించకుండా కొనుగోలు కేంద్రాలు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు. వర్షాలు ఎక్కువగా కురవడంతో సన్న రకం వరికి దోమపోటు, కాటుక తెగులు సోకి దిగుబడి తీవ్రంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి కూడా చేతికచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల రైతులకు పోలాలకు నిప్పుపెట్టి నిరసన తెలుపుతున్నారు. సన్న రకం వరికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల రైతన్నలు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ పార్టీలకతీతంగా పోరుబాటకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వం నిర్బంధంగా సన్నరకం వరిని సాగు చేయించడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సన్న రకం వరి వేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

    నిజామాబాద్ జిల్లాల్లో సన్నం వరికి మద్దతు ధర కోసం రైతన్నలు ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఇటీవల మొక్కజొన్న రైతులు రోడ్డెక్కడంతో ప్రభుత్వం దిగివచ్చి మక్కలను కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో.. దాన్ని స్పూర్తిగా తీసుకుని ఆందోళన కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. రాజ‌కీయాల‌కు ఆతితంగా రైతులు ఎక‌మ‌వుతున్నారు.. ఇప్ప‌టికే కిసాన్ కాంగ్రెస్ ఆర్మూర్ లో ఈ నెల 4న‌ మ‌హ‌ధ‌ర్నాకు పిలుపునిచ్చింది. ఈ మ‌హ‌ధ‌ర్నాకు పెద్ద ఎత్తున రైతులు రావాల‌ని రైతు సంఘాలు తిర్మాణ‌లు చేస్తున్నాయి.. రైతు ఐక్య‌వేదిక నాయ‌క‌త్వంలో మ‌హ‌ధ‌ర్నాకు స‌న్న‌దం అవుతున్నారు. స‌న్న‌రకం వ‌రికి క్వింటాలుకు 2500 రూపాయ‌ల ధ‌ర చెల్లించాలిని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక, వ‌ర్షాకాలం సీజన్‌కు గానూ అమాలు చేసిన నియంత్ర‌ణ సాగు విదానంలో రైతులు దొడ్డురకాల‌కు బ‌దులు స‌న్న‌ర‌కాల‌ను సాగుచేయాలిని ప్ర‌భుత్వ నిర్దేశించింది. దీంతో రైతులు స‌న్న‌ర‌కం వ‌రి పంట‌ను రెండున్న‌ర‌ ల‌క్ష‌ల ఏక‌రాల్లో సాగుచేసారు.. వ‌ర్షాలు ఎక్కువ‌గా కుర‌వ‌డంతో స‌న్న‌ర‌కం వ‌రికి దొమ‌పోటు, కాటుక తెగులు సోకి దిగిబ‌డి తీవ్రంగా ప‌డిపోయింది. కొంద‌రు రైతులు పంట‌కు నిప్పు పెట్టి నిర‌స‌న తెలిపారు.

    Farmers protest, Farmers protest For Supporting Price, Farmers protest In Telangana, paddy Farmers protest, రైతుల ఆందోళన, తెలంగాణలో రైతుల ఆందోళన, మద్దతు ధర కోసం రైతుల ఆందోళన, వరి రైతులు
    దోమకాటుతో నష్టపోయిన పంట


    ఒక్క నిజామాబాద్ జిల్లాలో ల‌క్ష ఎకరాల్లో స‌న్న‌ర‌కాలు సాగ‌య్యాయి.. సన్న ర‌కాల‌కు నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీ గ్రేడ్ ధ‌ర‌ను వ‌ర్తింప చేయాగా ఇప్పుడు ఏ గ్రేడ్ ధ‌ర‌ను అమాలు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సి నారాయాణ రెడ్డి అదేశించారు. స‌న్న‌ర‌కాల‌కు ఏ గ్రేడ్ ధ‌ర అమాల‌వుతున్నా క్వింటాలుకు 20రూపాల‌య ధ‌ర మాత్ర‌మే పెరిగింది. స‌న్న ర‌కాల‌కు ఇప్పుడు ఉన్న మ‌ద్ద‌తు ధ‌ర అమలు చేయాడం వ‌ల్ల ఏలాంటి ఉప‌యోగం లేద‌ని ప్ర‌త్యేక ధ‌ర‌ను నిర్ణ‌యించాల‌ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు రైతులు స‌న్న ర‌కాల‌కు ప్ర‌త్యేక ధ‌ర‌ను అమ‌లు చేయాని కొరుతు ప్ర‌జాప్ర‌తినిదుల‌కు అధికారుల‌కు లేఖ‌ల‌ను అందించారు.. కానీ ప్ర‌త్యేక ధ‌ర విష‌యంపై ప్ర‌భుత్వం నుంచి ఏలాంటి స్పంద‌న లేక పోవ‌డంతో అన్న‌దాత‌లు పోరుబాట‌కు సిద్ద‌మ‌య్యారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Farmers Protest, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు