Home /News /telangana /

FARMERS PROTEST FOR MAIZE PURCHESE IN ADILABAD VRY ADB

Adilabad : వాగులో రైతుల నిరసన..జొన్న కొనుగోలుకు ఇక్కట్లు

వాగులో రైతుల నిరసన..జొన్న కొనుగోలుకు ఇక్కట్లు

వాగులో రైతుల నిరసన..జొన్న కొనుగోలుకు ఇక్కట్లు

Adilabad :ఇన్నాళ్లు వరి ధాన్యం కొనుగోలుపై ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు తాజాగా మొక్కజోన్న రైతుల వంతయింది. పంటల కొగుగోలుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో వినూత్న నిరసనలకు దిగుతున్నారు.

    ఇన్నాళ్లు వరి ధాన్యం కొనుగోలుపై ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు తాజాగా మొక్కజోన్న రైతుల
    వంతయింది. పంటల కొగుగోలుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో వినూత్న నిరసనలకు దిగుతున్నారు.

    రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవడానికి తిప్పలు తప్పడం లేదు. ఉమ్మడి
    ఆదిలాబాద్ జిల్లాలో యాసంగిలో జొన్నలు పండించిన రైతులు చేతికి వచ్చిన దిగుబడులకు అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జొన్న కొనుగోళ్ళకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని వాపోతున్నారు. మరోవైపు అకాల వర్షం తమ పంటను తడిపి ముద్ద చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ రైతులు ప్రభుత్వం వెంటనే జొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. గ్రామ సమీపంలోని పెద్దవాగులోకి అర్ధ నగ్నంగా దిగి జల దీక్ష చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తాము పండించిన జొన్న పంటను కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం అదే మండలంలోని పొచ్చెర గ్రామ రైతులు ప్రధాన రహదారిపై జొన్న కంకులను పోసి వాటికి నిప్పుపెట్టి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

    అయితే రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోలుగు మద్దతు ధరను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ధేశిశిత లక్ష్యం మేరకు 50 శాతం పూర్తి చేసినట్టు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అయితే వరి ధాన్యంలో రైతుల భాదలు గట్టేంచిన ప్రభుత్వం ఇక జొన్న కొనుగోలుపై కూడ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Farmer, Farmers Protest

    తదుపరి వార్తలు