Home /News /telangana /

FARMERS POURED TOMATOES ON THE ROAD IN PROTEST AS A KILO OF TOMATO FELL TO RS 4 IN ADILABAD ADB PRV

Tomato: అయ్యో రైతన్నకు ఎంత కష్టకాలం.. ఆ జిల్లాలో కిలో నాలుగు రూపాయలకు పడిపోయిన టమాట ధర..

రోడ్డుపై పారబోస్తున్న రైతులు

రోడ్డుపై పారబోస్తున్న రైతులు

బంగారం ధరతో పోటీపడి మరీ మిర్చి ధర ఘాటెక్కుతోంది. తెల్లబంగారంగా పిలువబడుతున్న పత్తి ధర కూడా పైపైకిపోతోంది. అయితే అందుకు భిన్నంగా టమాట రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైంది.

    (కె. లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)

    ఒకపక్క మార్కెట్ లో బంగారం  ధర (Gold price) దగదగలాడుతోంది. మరోవైపు ఆ బంగారం ధరతో పోటీపడి మరీ మిర్చి ధర ఘాటెక్కుతోంది. తెల్లబంగారంగా పిలువబడుతున్న పత్తి ధర కూడా పైపైకిపోతోంది. అయితే అందుకు భిన్నంగా టమాట (Tomato) రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన టమాటకు ధర రాక దిగాలు పడే పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad)జిల్లాలోని పలు మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఈ టమాట (Tomato) పంట సాగవుతుంది. అయితే ప్రస్తుతం టమాట రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. బీటుకు తీసుకువచ్చిన టమాట ధర కిలో నాలుగు రూపాయలకు పడిపోవడంతో అక్కడక్క రైతులు (Farmers) రోడ్డుపై పారబోసి, పశువులకు మేతగా వేసి నిరసన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో ఇలాగే జరిగింది.

    టమాట పెద్ద మొత్తంలో మార్కెట్ కు రావడంతో..

    నిర్మల్ (Nirmal) జిల్లాలోని ముథోల్ నియోజకవర్గంతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలోని గ్రామాల్లో చాలా మంది రైతులు టమాట పంటను సాగు చేస్తున్నారు. నిత్యం టమాట క్యారెట్లను వేకువ జామున ఆటోల్లో భైంసా బహిరంగ మార్కెట్ (Market) కు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. అయితే తీరుగా ఈ రోజు కూడా టమాట పెద్ద మొత్తంలో మార్కెట్ కు రావడంతో వ్యాపారులు సిండికేట్గా మారిపోయారు.  దీంతో టమాట ధర  (Tomato price)  ఒకేసారి కిలో నాలుగు రూపాయల చొప్పున 25 కిలోల క్యారెట్  80 నుంచి 100 రూపాయల వరకు పలికింది.

    Nizamabad: మూడు నెలల్లోనే రూ. 6 లక్షల సంపాదన.. నిజామాబాద్​లో ఓ ఆదర్శ రైతు సక్సెస్ స్టోరీ.. వివరాలివే..

    నిన్న, మొన్నటి వరకు క్యారెట్ ధర 250 నుంచి 300 రూపాయల ధర పలుకగా.. ఇప్పుడు ఏకంగా సగానికి పైగా ధర తగ్గించేశారని రైతులు (Farmers) ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు పెట్టిన పెట్టుబడులు, రవాణా చార్జీలు కూడా రాని పరిస్థితి రావడంతో కన్నెర్ర చేశారు. వ్యాపారులకు అమ్మే బదులు రోడ్డుపై పారిబోసి నిరసన వ్యక్తం చేశారు.

    No youngster in Village: ఆ ఊళ్లో సగం ఇళ్లకు తాళాలే.. మిగతా ఉరంతా వృద్దులే.. ఇంతకీ ఎక్కడా ఊరు..? ఏమిటా కథ..?

    అంతకు ముందు నిరసన (Protest) కూడా తెలిపారు. పలువురు రైతులు మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడి టమాట  (Tomato) సాగు చేస్తే మార్కెట్లో వ్యాపారులు మాయజాలం ప్రదర్శించడం సరికాదని వాపోతున్నారు. రైతు నిర్ణయించాల్సిన ధరను వ్యాపారులు నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Farmers, Nirmal, Tomato Price

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు