Home /News /telangana /

Medak : తహాసీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు..పరిస్థితి ఉద్రిక్తం...!

Medak : తహాసీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు..పరిస్థితి ఉద్రిక్తం...!

ఎమ్మార్వో పై డీజిల్ పోసిన రైతులు (ప్రతికాత్మక చిత్రం )

ఎమ్మార్వో పై డీజిల్ పోసిన రైతులు (ప్రతికాత్మక చిత్రం )

Medak : మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది..ఏకంగా ప్రభుత్వ ఉన్నతాధికారిపైనే రైతులు డిజిల్ పోశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతుకు అందాల్సిన భీమా అగిపోయిందంటూ ఆందోళన చేస్తున్న రైతులను పట్టించుకోకపోవడంతో .. ఆయనపై డిజిల్ పోసినట్టు సమాచారం.. సాధారణంగా రైతులే ఎమ్మార్వో కార్యాలయాల ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తారు...కాని ఇక్కడ మాత్రం రైతులు రివర్స్ గేర్ వేశారు.

ఇంకా చదవండి ...
  మెదక్ జిల్లాలో రైతులు దారుణానికి ఒడిగట్టారు. ఇటివల చనిపోయిన రైతుకు రైతుభీమా రాకపోవడానికి కారణం ఎమ్మార్వో అంటూ ఆయనపై ఏకంగా డీజిట్ పోయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా చెందిన తాళ్లపల్లి తండాలో మాలోతు బాలు అనే రైతు కరెంట్ షాక్‌తో మృత్యువాత పడ్డాడు.అయితే అతనికి భూమి ఉన్నా...సకాలంలో పట్టా అందలేదని రైతులు చెప్పారు. దీంతో ప్రభుత్వం ఇస్తున్న రైతు భీమా పథకం డబ్బులు చేరకపోవడంతో గ్రామ రైతులు స్థానిక శివ్వం పేట తహాశీల్దారు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రైతుల ముందు నుండి వారిని పట్టించుకోకుండా తహాసీల్దారు భానుప్రకాశ్ వెళుతుండడంతో ఓ రైతు ఆయనపై డీజిల్ పోశాడు. అయతే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడి నుండి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.

  సీఎం కేసిఆర్ రైతుల భూములపై విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చానని చెబుతున్నా..క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదనేదానికి ఈ సంఘటన ఉదహారణ..ఇలా కొన్ని వేల మందికి ఇంకా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందక అందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థతి రాష్ట్రంలో నెలకొంది. వ్యవసాయ రంగ భూముల్లో ప్రక్షాళన తీసుకువచ్చి..ఎలాంటీ అక్రమాలకు తావు లేకుండా ధరణి వెబ్‌సైట్‌ను తీసుకువచ్చారు..అయితే దీంట్లో అనేక లోటుపాట్లు బయటపడతున్నాయి. కొంతమంది రైతులకు పాస్‌పుస్తకాలు రాకపోవడంతో ఆందోళన బాటపడుతున్నారు.

  ముఖ్యంగా పట్టాదారు పాస్‌పుస్తకం ద్వార రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ముందుగా ప్రభుత్వం ప్రతి ఎకరాకు అయిదువేల రైతుబంధు సాయం చేయడంతోపాటు అకస్మాత్తుగా చనిపోయిన రైతులకు అయిదు లక్షల రూపాయల భీమాను వర్తింప చేస్తున్నారు. దీంతో పట్టాదారు పాసుపుస్తకాలకు రైతుల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది.

  అయితే ధరణి వెబ్‌సైట్ రూపకల్పన తర్వాత అనేక మార్పులను తీసుకువస్తున్న ప్రభుత్వం రైతుల సమస్యలను తీర్చేందుకు అనేక అప్షన్లు ఇచ్చింది.. దీంతో పలు రకాలుగా భూములను వర్గీకరించి వాటిలో పొందుపరించింది. ఇటివల కూడా ఎలాంటీ పాస్‌బుక్ లేకున్నా తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఆప్షన్ కూడా ప్రవేశపెట్టింది.

  కాగా రెండు సవంత్సరాల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్ తహాసీల్దార్‌ విజయారెడ్డిపై దుండగులు పెట్రోల్ పోసి దారుణంగా సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు తమకు రక్షణ కవాలని ఆందోళన బాట పట్టారు. దీంతో కార్యాలయాల్లో పోలీసు సిబ్బంది నియమించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో ప్రతి కార్యాలయంలో సీసీ కెమెరాలు పెడతామని హామీ ఇచ్చింది. కాని ఆ హామిలు మాత్రం ఆచరణకు నోచుకోలేదు..దీంతో అధికారులు తమ భద్రతపై ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ అధికారులు కూడా రైతుల సమస్యలను చిత్తశుద్దితో పట్టించుకుంటే ఇలాంటీ దారుణాలు చోటు చేసుకునేందుకు అవకాశాలు ఉండవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Attack, Farmers, Medak

  తదుపరి వార్తలు