హోమ్ /వార్తలు /తెలంగాణ /

Leopard in Farms: ఆ జిల్లా రైతన్నల్లో భయం భయం.. పొలాల్లో గాంఢ్రిస్తూ తిరుగుతున్న చిరుతపులి.. 

Leopard in Farms: ఆ జిల్లా రైతన్నల్లో భయం భయం.. పొలాల్లో గాంఢ్రిస్తూ తిరుగుతున్న చిరుతపులి.. 

చేనులో సంచరిస్తున్న చిరుత

చేనులో సంచరిస్తున్న చిరుత

చిరుత మొన్న నిర్మల్ జిల్లా కాల్వ నరసింహస్వామి ఆలయ సమీపంలో దర్శనమివ్వగా, తాజాగా ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామంలో పంటచేలలో దర్శనమిచ్చింది. దీంతో రైతులు భయాందోళనకు లోనయ్యారు.

(Lenin, news 18, Adilabad)

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుత పులి (Leopard) కలకలం రేపుతోంది. మొన్న నిర్మల్ జిల్లా కాల్వ నరసింహస్వామి ఆలయ సమీపంలో దర్శనమివ్వగా, తాజాగా ఆదిలాబాద్ (Adilabad)జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామంలో పంటచేలలో దర్శనమిచ్చింది. దీంతో రైతులు భయాందోళనకు లోనయ్యారు. కాగా రైతులు కొంతమంది స్థానికులు కలిసి ఆ చిరుతను తరిమి వేశారు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం భయాందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు. అయితే గత ఆరు నెలలు గా తాంసి మండలంలోని  లీముగుడా, అట్నం గూడ, అంబుగామ్, వామన్ నగర్, గుబిడి పల్లె పరిసరాల్లో చిరిత దర్శనమిచ్చింది. మళ్లీ ఇవాళ మండలంలోని కప్పర్ల గ్రామ సమీపంలోని పంట చేలల్లో(In crop fields) పొలం పనులకు వెళ్లిన రైతులకు కనిపించింది. కప్పర్ల  గ్రామానికి చెందిన కేమ పరమేశ్వర్  తన పొలంలో జొన్నపంట ను హార్వెస్టర్ తో తీస్తున్న సమయంలో చిరుత పులి కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైన రైతు భయాందోళనతో వెంటనే చుట్టూ పొలాల్లోని రైతులను (farmers) అప్రమత్తం చేశాడు. అనంతరం గ్రామ సర్పంచ్ సదానందంకు సమాచారం అందించారు. సర్పంచ్ అటవీ శాఖ అధికారులకు ఈ విషయం తెలియజేశాడు.

సెల్ ఫోన్ తో చిత్రీకరించి ..

చిరుతపులి వీడియోలను (Leopard videos) ఫోన్ లలో చిత్రీకరించి.. స్థానిక సర్పంచ్ సదానంద్ కు  సమాచారం అందించారు. సర్పంచు  ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. కాగా పంట చేనులోని పొదల్లో దాక్కుకున్న చిరుత పులి స్థానికులు తరమడంతో గుట్టవైపు పారిపోయింది. పంటచేనులో (farms) నుండి చిరుత పరుగుతీస్తున్న దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్ తో చిత్రీకరించి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు సర్పంచ్ ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్.ఎస్.ఓ ప్రేమ్ సింగ్ సూచించారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం కాల్వ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై చిరుతపులి కనిపించింది. ఆలయ పూజారి, కొంతమంది స్వామివారి మాలధారులు ఈ పులిని గమనించారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులకు తెలియజేశారు.

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా కాల్వ అడవుల్లో చిరుత పులి సంచరిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా స్వామి ఆలయం పక్కన గుట్టపైన ఓ చిరుత పులి కనబడంతో ఆ ప్రచారానికి బలం చేకూనట్లయ్యింది. కాల్వ అడవుల్లో మూడు చిరుత పులులు సంచరిస్తున్నాయని ప్రచారం జరిగింది. నెల రోజుల క్రితం గొర్రెల మందపై దాడి చేసి గొర్రెను చంపేశాయి. తాజాగా స్వామివారి గుట్టపై చిరుత తిరుగుతుండటాన్ని భక్తులు గమనించారు. గుట్టపై స్వామి వారి గుడి ముందున్న బండరాయిపై ఓ చిరుత పులి ఠీవిగా అటూ ఇటూ తిరుగుతూ భక్తుల కంటబడింది. దీంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. చిరుత పులి సంచారం నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని, అడవిలోకి వెళ్ళేవారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.

First published:

Tags: Adilabad, Farm house, Farmer, Leopard, Tiger

ఉత్తమ కథలు