హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : సిరులు కురిపిస్తున్న బంతి పూల సాగు .. అక్కడ ఒక్కో రైతు నెలకు ఎంత సంపాధిస్తున్నారో తెలుసా..?

Telangana : సిరులు కురిపిస్తున్న బంతి పూల సాగు .. అక్కడ ఒక్కో రైతు నెలకు ఎంత సంపాధిస్తున్నారో తెలుసా..?

Marigold Flower

Marigold Flower

Telangana: చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామస్తులు తక్కువ పెట్టుబడి సాయంతో బంతి పువ్వు సాగు ఎంచుకున్నారు. ఒకరిద్దరు కాదు గ్రామంలోని రైతులంతా ఇదే సాగును ఎంచుకున్నారు. ఊరు మొత్తం బంతిపూలతో తోటలో నిమగ్నమయ్యారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Medak, India

  (K.Veeranna,News18,Medak)

  తెలంగాణ(Telangana) వ్యాప్తంగా గతంలో రైతులు సాధారణంగా బయలు పంటల వైపు చూసేవారు. ఇప్పుడున్నటువంటి సమాజంలో మార్పుల కోసం రైతులు వ్యవసాయం ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. సాగు కాదు రైతుకు సాయం చేసే విధంగా వ్యవసాయాన్ని మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే ఏ సాగు చేస్తే రైతులు నాలుగు రూపాయలు మిగులుతాయి...తక్కువ పెట్టుబడి అవుతుందనే కోణంలో ఆలోచించి రైతుల కష్టాలను తీరుస్తూ కాసులను కురిపిస్తున్న బంతిపూల(Marigold flower)సాగుపై మొగ్గు చూపుతున్నారు.

  Sad news: తాళి కట్టిన భర్తకు తలకొరివి పెట్టిన భార్య .. కంటతడి పెట్టించిన దృశ్యం

  పూలతోటలో ధన సిరులు ..

  వ్యవసాయ విధానంలో ఆధునిక పద్దతులు, యాంత్రిక పని ముట్లు వచ్చినట్లుగానే రైతుల్లో కూడా మెళకువలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే తోటలు, కూరగాయల మొక్కలతో పాటు వాణిజ్య పంటలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మెదక్ జిల్లాకు చెందిన ఓ రైతు మరో అడుగు ముందుకేశాడు. చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామస్తులు తక్కువ పెట్టుబడి సాయంతో బంతి పువ్వు సాగు ఎంచుకున్నారు. ఒకరిద్దరు కాదు గ్రామంలోని రైతులంతా ఇదే సాగును ఎంచుకున్నారు. ఊరు మొత్తం బంతిపూలతో తోటలో నిమగ్నమయ్యారు.

  పూల సాగుతో పుష్కలంగా లాభాలు..

  ఒక ఎకరా పొలంలో బంతి పూల సాగు చేస్తే కనీసం లక్షరూపాయల ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. అత్యంత తక్కువ పెట్టుబడితో త్వరగా చేతికొచ్చే సాగు కావడంతో బంతి పూల సాగునే అందరం ఎంచుకున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా దసరా, దీపావళి వచ్చిందంటే పూలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక ఈ పండగలు ముగియగానే కార్తీక మాసమంతా వీటి కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. బతుకమ్మ పండగ సాగే 9 రోజుల పాటు పూల అవసరం ఉంటుంది. ఇదే క్రమంలో బంతి పూలకు గిరాకీ అధికంగా ఉంటుంది. అందుకే గ్రామంలోని రైతులంతా బంతి పూల సాగుతో లాభాలు గడిస్తున్నారు.

  Bathukamma sarees: కూరగాయల మూటలు, చేనుకు పరదాలుగా మారిన బతుకమ్మ చీరలు ..ఎక్కడ జరిగిదంటే..?

  ఊరంతా బంతి పూలే ..

  మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో ఎనిమిదేళ్ల కిందటి వరకు రుక్మాపూర్ గ్రామంలో రైతులంతా సంప్రదాయ పంటలు సాగు చేస్తుండేవారు. నీటి వసతి ఉన్న వారికి ఎలాంటి డోకా లేకపోయినా, బోర్లు లేని వారు నష్టాలపాలయ్యారు. ఈ తరుణంలో గ్రామానికి చెందిన తొడుపునూరి లింగం అనే రైతు తన బంధువులు బంతి పూలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిసుండటాన్ని గమనించి ఇదే తరహాలో ముందడుగు వేశారు. దీంతో ఆయన లాభాలు ఆర్జించడాన్ని గమనించిన 80 మంది రైతులు సైతం అదేబాటలో నడిచారు. ఇలా ఒకరిని చూసి మరొకరు. ఊరంతా బంతి సాగు చేయడానికే మొగ్గుచూపుతూ వస్తున్నారు.

  నెలకు 20వేల ఆదాయం..

  తక్కువ నీటితో.బంతి సాగుకు తక్కువ నీరే అవసరం కావడంతో అందరూ ఇటు వైపు దృష్టిసారించారు. కొంతమంది వాన నీటిని ఒడిసిపట్టుకొని అవసరమైన మేర వినియోగించుకుంటున్నారు. ఓ వైపు బంతితో పాటు వరి, కంది, పత్తి వంటివి సైతం పండిస్తున్నారు. ఎరుపు, తెలుపు రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విత్తనం తెచ్చుకొని విత్తుకుంటున్నారు. తొలినాళ్లలో లింగం ఈ ప్రాంత రైతులకు బంతి సాగుపై అవగాహన కల్పించారు. కొందరు రైతులు బిందు పరికరాలు బిగించి నీటి తడులు అందిస్తున్నారు. రైతులు తమ దిగుబడులను చేగుంటతో పాటు హైదరాబాద్ మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు. ఏడాది పొడవునా ఈ గ్రామంలో బంతి సాగే కనిపిస్తుంది. ఇలా ఇక్కడి వారు నష్టాలను అధిగమించి లాభాల వైపు పయనిస్తుండటం విశేషం.విత్తనాలు, ఎరువులు, మందులు ఇతర ఖర్చులన్నీ పోగా నెలకు 20వేలు సంపాదిస్తున్నామంటున్నారు రైతులు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Medak, Telangana News

  ఉత్తమ కథలు