FARMERS NOT ACCEPTING TO GIVE THAIR FORM LANDS TO TRS MEETING VRY
Warangal : టీఆర్ఎస్ వరంగల్ సభకు హుజూరాబాద్ ఎఫెక్ట్..? భూములు ఇవ్వమంటూ.. రైతుల వ్యతిరేకత..!
Warangal : టీఆర్ఎస్ వరంగల్ సభకు హుజూరాబాద్ ఎఫెక్ట్..?
Warangal : హుజూరాబాద్ ఉప ఎన్నికల ఎఫెక్ట్ వరంగల్ సభపై పడిందా.. ఇన్నాళ్లు ప్రభుత్వంపై ప్రజల్లో లేని వ్యతిరేకతా ఫలితాలతో వచ్చిందా.. సభకు మా భూములు ఇవ్వమంటూ రైతులు వ్యతిరేకించడం వెనక మర్మం ఏమిటీ..
హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రాజకీయంగా మార్పులతో పాటు ప్రజల్లో మార్పులు వస్తున్నాయి.
ఇందుకు అనుగుణంగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీ వరంగల్‌లో చేపట్టిన భారి బహిరంగ సభపై ప్రతికూల ఫలితాలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే హన్మకొండ జిల్లాలోని రాంపూర్ వద్ద భారి బహిరంగ సభ చేపట్టాలని నిర్ణయించిన టీఆర్ఎస్కు చుక్కెదురవుతోంది.
ముఖ్యంగా పది లక్షల జనాభాతో సభను జరుపుకోవాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లలో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఇందుకోసం సభను నిర్వహించేందుకు చాలా ప్రాంతాలను పరీశీలించారు. సరైన స్థలం లేకపోవడంతో చివరికి రాంపూర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అక్కడ నిర్వహించే సభ కోసం స్థల సేకరణ కార్యక్రమాన్ని స్థానిక నేతలు ప్రారంభించారు. అయితే సభ ప్రాంగణంలో రైతులు పంటలు వేసుకుని ఉన్నారు. సభ ద్వారా ఆ పంటలు నాశనం అయ్యె అవకాశం ఉండడంతో వాటికి నష్టపరిహారం ఇస్తామని పార్టీ నేతలు రైతులకు చెప్పారు.
దీంతో తమ భూములతో పాటు పంటలను నాశనం చేసుకునేందుకు రైతులు ముందుగా ఒప్పుకున్నా.. తాజాగా కొంతమంది రైతులు రివర్స్ అయ్యారు. తాజాగా నేడు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహారి, స్థానిక నేతలతో కలిసి స్థల పరీశీలనకు వెళ్లడంతో స్థానిక రైతులు అడ్డుకున్నారు. తమ భూముల్లో సభ నిర్వహించవద్దని చెప్పారు. దీంతో అక్కడే ఉన్న కొంతమంది టీఆర్ఎస్ నాయకులతో వాగ్వావాదానికి దిగారు. ఎలా ఇవ్వరో చూస్తామంటు హెచ్చరించడంతో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. ఇరు వర్గాలు తోపులాటకు సైతం దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అక్కడ నుండి పంపించి వేశారు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో కడియం శ్రీహరి అక్కడే ఉండడం గమనార్హం.
ఇదంతా గమనిస్తే.. గత పదిహేను రోజులుగా మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమెష్లతోపాటు విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణిలు స్థలాల పరీశీలన చేశారు. కాని ఇప్పటి వరకు ఎలాంటీ వ్యతిరేకత కనబరచని రైతులు హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకోవడంతోపాటు స్థానిక బీజేపీ కార్పోరేటర్లు సైతం వారికి అండగా నిలిచారు. దీంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మొత్తం మీద హుజూరాబాద్ ఫలితాల ప్రభావం అధికార టీఆర్ఎస్ పై భవిష్యత్‌లో చూపిస్తుందని ఊహిస్తున్నా... ఈ సంఘటనతో ఆ పార్టీ అంచనాలు తలకిందులయ్యె అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భవిష్యత్‌లో అధికార పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా ఇక ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిని అవసరం ఏర్పడనుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.