కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటూ వడ్లు కొనేది లేదని స్పష్టం చేస్తుండటంతో సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని చౌరస్తాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంప్లెక్స్ ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చావు డబ్బులు కొడుతూ నిరసన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెరాస నాయకులు ఎం పీ పి , మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ , మరియు మున్సిపల్ కౌన్సిలర్లు రైతులు, వివిధ గ్రామాల సర్పంచులు, తెరాస కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. ధర్నా ఆందోళన కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. తెలంగాణ రైతుల రోడ్లు ఎందుకు కొనరని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రైతుల ఒడ్లు కొనకపోతే కేంద్రానికి ఏం వస్తుందని విచారం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా తెలంగాణలోని ప్రతీ జిల్లాలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. దీనిలో భాగంగా.. హైదరాబాద్ లో ఈ నిరసనలు కొనసాగాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసన గా చేపట్టిన ర్యాలీలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బంజారాహిల్స్ డివిజన్ తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రం, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర మంత్రుల బృందం, టిఆర్ఎస్ ఎంపీల విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం లిఖితపూర్వకంగా చెప్పాలి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశాడు. 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని తాము కోరామని.. గతంలో వస్తే 60 లక్షల టార్గెట్ పూర్తి చేసి రండి అన్నారు... మిగిలిన వానాకాలం వడ్ల సేకరణపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. కిషన్ రెడ్డి పోయిన యాసంగి గురించి మాట్లాడుతూ... ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నారని.. మీడియా దయచేసి దీన్ని గమనించాలన్నారు. మిగతా ధాన్యం కొంటామని కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని.. బియ్యం మిల్లింగ్ తర్వాత తరలించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కరీంనగర్ జిల్లాలో.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వపు రైతు వ్యతిరేక నిర్ణయాల తీరుకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపడుతున్న రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు, టిఆర్ఎస్ ముఖ్య కార్యదర్శులు , గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government, Mahabubnagar, Telangana Government