Eetela Rajender : భూములు ఆక్రమించారు...తిరిగి ఇచ్చేయండి ...అచ్చంపేట,హకీంపేట రైతులు

భూములు ఆక్రమించారు...తిరిగి ఇచ్చేయండి అచ్చంపేట,హకీంపేట రైతులు

Eetela Rajender : ఈటల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమున హెచరిస్‌ వ్యవహరంలో రైతులు పలు రకాలుగా వివరణ ఇచ్చారు. తమ భూములను కబ్జా చేయడంతోపాటు భూమి తీసుకుని డబ్బులు ఇవ్వలేదని మరికొంత రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు..

 • Share this:
  ఈటల రాజేందర్‌కు చెందిన ‘జమున హ్యాచరీస్‌’ కంపనీ తమ భూములను కబ్జాచేశారని, ఎటువంటి సమాచారం లేకుండా రోడ్డు వేసి ఆక్రమించారని, విక్రయించిన భూమికి పూర్తి డబ్బులు ఇవ్వలేదని పలువురు రైతులు రెవెన్యూ అధికారులకు వివరణ ఇచ్చారు.

  మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివారులో జమున హ్యాచరీస్‌ పరిశ్రమ అసైన్డ్‌ భూముల కబ్జాపై రెవెన్యూ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆ భూములు కబ్జాకు గురైనట్టు గుర్తించిన సర్వే నంబర్లలోని సంబంధిత రైతులు 75 మందికి కబ్జాపై వివరణ ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం అధికారులు నోటీసులు జారీచేశారు. కాగా నోటీసులపై స్పందించిన పలువురు రైతులు మాసాయిపేట తహాసీల్దార్ కార్యాలయానికి వచ్చి లిఖిత పూర్వకంగా తమ వివరణను తాహసిల్దార్‌ మాలతికి అందజేశారు.

  అయితే పలువురు రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. అధిక సంఖ్యలో రైతులు తాము భూములను ఎవరికీ విక్రయించలేదని, జమున హ్యాచరీస్‌ పరిశ్రమ చెందిన యాజమాన్యం తమ భూములను కబ్జా చేసి పలు నిర్మాణాలు చేపట్టడంతోపాటు ఇతర పనులకు వినియోగించుకొంటున్నారని వివరించారు..కాగా మరికొందరు రైతులు తమకు ఎలాంటి సమాచారం లేకుండానే తమ భూముల్లో నుంచి రోడ్డు నిర్మించి ఆక్రమించారని పేర్కోన్నారు. ఇక మరికొంతమంది మాత్రం తమ భూముల వద్దకు వెళ్లకుండా కంచె, గేటు ఏర్పాటుచేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రెవెన్యూ అధికారులకు వివరణ ఇచ్చారు.

  ప్రభుత్వం తమకు ఇచ్చిన స్థలాల్లో పూర్తిస్థాయి సర్వే చేపట్టి తమ భూములను తమకు అప్పగించాలని రైతులు కోరారు..ఇక తాము విక్రయించిన భూములకు పూర్తిగా డబ్బులు చెల్లించలేదని మరికొంతమంది రైతులు తెలిపారు.
  Published by:yveerash yveerash
  First published: