Home /News /telangana /

కళ్ల ముందే చెట్టుపై నుంచి కింద పడి చనిపోయిన రామ చిలుక.. ఆ రైతులు ఏం చేశారంటే..

కళ్ల ముందే చెట్టుపై నుంచి కింద పడి చనిపోయిన రామ చిలుక.. ఆ రైతులు ఏం చేశారంటే..

రామచిలుక అంత్యక్రియలను నిర్వహించిన రైతులు

రామచిలుక అంత్యక్రియలను నిర్వహించిన రైతులు

ఓ రైతు తన పొలంలో రామ చిలుక చనిపోవడాన్ని చూశాడు. చనిపోయిన ఆ రామ చిలుకను అలాగే వదిలివేయకుండా దానికి అంత్యక్రియలను నిర్వహించాలనుకున్నాడు. తన తోటి రైతులతో కలిసి..

    వానర సైన్యంగా, ఆంజనేయుడి ప్రతిరూపంగా భావిస్తూ, కోతులకు అంత్యక్రియలు నిర్వహించడం చూశాం.. విన్నాం. కానీ రామచిలుక కు అంత్యక్రియలు నిర్వహించడం కొత్తగా వింటున్నాం. కళ్లారా చూస్తున్నాం. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో మేడేపల్లి నుండి కట్టకూరు వెళ్లే మార్గంలో ఓ రామ చిలుక హఠాత్తుగా చెట్టు పై నుంచి కింద పడి మృతి చెందింది. రామచిలకకు అంత్యక్రియలు నిర్వహించి, తమ రామభక్తిని చాటుకున్నారు స్థానిక రైతులు. తమ వ్యవసాయ భూమిలో అపస్మారక స్థితిలో ఉన్న రామచిలుక తమ కళ్లెదుటే చనిపోవటాన్ని చూసిన రైతులు రామభక్తితో, రామనామమే తమకు పరమపదంగా భావిస్తూ రామచిలుక కు సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా మేడేపల్లి గ్రామ రైతు సామినేని పూర్ణచందర్రావు మాట్లాడుతూ రామచిలుకకు అంత్యక్రియలు నిర్వహించటం రామునికి సేవ చేసినట్లుగా ఉందన్నారు. మేడిపల్లి గ్రామస్తులు నంద్యాల అప్పయ్య మాట్లాడుతూ మనుషులతో కలసి సహజీవనం సాగిస్తున్న పశువులూ, పక్షులు చనిపోయిన సందర్భాల్లో బాధ కలుగుతుందనీ, అయితే రామ నామంతో ఉన్న రామచిలుక చనిపోవడంతో అంత్యక్రియలు నిర్వహిస్తే మంచిదనే భావనతో నిర్వహించామని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

    గ్రామ రైతు పోతునూక మధుసూదన్ రావు మాట్లాడుతూ తమ కళ్లెదుటే అకస్మాత్తుగా చనిపోయిన రామచిలుక మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, రామచిలుకను అలా వదిలి పెట్టడం మంచిది కాదనే భావనతో, అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు. మనపై ఆధారపడి జీవించే పశువులూ, పక్షులు మరణించిన సందర్భాల్లో వాటిని అలా వదిలేయకుండా అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా తోటి జీవుల పట్ల జాలిని చూపొచ్చని, పర్యావరణాన్నీ కాపాడవచ్చనే సందేశాన్ని అందించిన మేడేపల్లి గ్రామ రైతులకు, గ్రామస్తులకు పలువురు అభినందనలు తెలియ చేశారు. కార్యక్రమంలో గ్రామ రైతులు సామినేని పూర్ణచందర్ రావు, పోతునూక మధుసూదన్ రావూ, గ్రామస్తులు నంద్యాల అప్పయ్య, మోర వెంకటరామారావు, ఎడవెల్లి గ్రామానికి చెందిన పరికపల్లి ఆదినారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
    ఇది కూడా చదవండి: నా డబ్బు.. నా ఇష్టమంటూ.. 60 ఏళ్ల వృద్ధ డాక్టర్ నిర్వాకం.. అమ్మాయిలతో చాటింగ్ కోసం రూ.70 లక్షలు..!
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime, Hyderabad, Khammam, Telangana, Trending videos, Viral Videos

    తదుపరి వార్తలు