Home /News /telangana /

FARMER TRIES TO ATTACK ON MINISTER KTR CONVOY WITH SLIPPER IN JAGTIAL VIDEO POLICE ARREST HIM KNR SK

KTR: మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం.. పోలీసుల ముందే.. కాన్వాయ్‌పై చెప్పు విసిరిన రైతు

పోలీసుల అదుపులో రైతు

పోలీసుల అదుపులో రైతు

Telangana Minister KTR: మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మెట్‌పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా.. మంత్రి కాన్వాయ్‌పై ఓ రైతు చెప్పుతో దాడిచేశాడు.

    (పి. శ్రీనివాస్, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి)

    తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌‌ (Telangana Minister KTR)కు చేదు అనుభవం ఎదురైంది. ఓ రైతు మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌పై చెప్పులు విసిరాడు. శుక్రవారం జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాల నాయకులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. అయితే, ఎలాంటి తప్పు చేయకున్నా అకారణంగా అరెస్టులు చేయడం అన్యాయమని పలువురు రైతు సంఘాల నాయకులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మెట్పల్లిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌పై చెరకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి చెప్పు విసిరారు.


    CM KCR: కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ.. ఈ నెలలోనే ప్రకటన..! పార్టీ పేరు ఇదే..

    ముందస్తుగా అరెస్ట్ అయి మెట్పల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న నారాయణ రెడ్డి...  స్టేషన్ ముందు నుంచి కేటీఆర్ కాన్వాయ్ వెళ్లడం గమనించి పరిగెత్తుకుంటూ వెళ్లి చెప్పు (Farmer throws slipper on minsiter KTR) విసిరారు . వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు . అనంతరం పోలీస్ స్టేషన్ లోపలికి తరలించారు. ఈ ఘటనను అక్కడున్నరైతు నేతలు వీడియోలు తీశారు. కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలావుండగా.. ఇటీవల మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy)పై రెడ్డి సంఘం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  చెప్పులు, రాళ్లు,  బాటిళ్లు, చైర్లను మంత్రి కాన్వాయ్‌పైకి విసిరారు. ఈ దాడి ఘటన జరిగిన తర్వాత .. ఇప్పుడు అలాంటి అనుభవమే మంత్రి కేటీఆర్‌కు కూడా ఎదురుకావడం గమనార్హం .

    అక్కడ మత్స్యకారుడికీ ఓ పరీక్ష ఉంటుంది తెలుసా.. పాసైతేనే మత్స్యకారుడిగా గుర్తింపు..

    ఐతే ఇలా ఎందుకు చేసారని రైతును పోలీసులు అడగగా ..టీఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చాక నిజం షుగర్ ఫ్యాక్టరీ (Nizam sugar Factory)ని తెరిపిస్తామని హామీ ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు దాటినా.. ఇంకా అమలు కాలేదని అన్నారు.  ఇప్పటివరకు అటువైపు ఎన్నడూ కూడా సీఎం కేసీఆర్ (CM KCR), కేటీఆర్ (KTR) కన్నెత్తి చూడలేదని విమర్శించారు. తాము పండించిన చెరుకు ధరకు మద్దతు లేక నష్టపోతున్నామని.. రైతు బాధలు చెప్పుకుంటే విందామనే నాయకుడే జిల్లలో కరువైయారని ఆగ్రహం వెలిబుచ్చాడు. ఈసంఘటనతో నైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఇలా చేసానని రైతు నారాయణ రెడ్డి తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Farmer, KTR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు