Home /News /telangana /

FARMER PUT HIS CROP ON FIRE IN NIRMAL DISTRICT NS ADB

Telangana: అయ్యో అన్నదాత.. మనస్థాపం చెంది దెబ్బతిన్న పంటకు నిప్పు

పంటకు నిప్పు పెడుతున్న రైతు

పంటకు నిప్పు పెడుతున్న రైతు

తీవ్ర నష్టం వాటిల్లడంతో ఏమి చేయాలో తెలియక ఆవేదన చెందిన రైతు చివరకు తన పెంచిన పంటకు తానే నిప్పుపెట్టిన ఈ విషాదకర ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

    ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు తీసుకువస్తున్నా.. ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా.. అన్నదాతల బతుకులు మాత్రం మారడం లేదు. వారి కష్టాలు ఏ మాత్రం తీరడం లేదు. ఏటా.. ఏదో విధంగా రైతులు నష్టపోతూనే ఉన్నారు. వర్షాలు లేక కొన్ని సార్లు, వర్షాలు ఎక్కువై మరి కొన్ని సార్లు పంట దెబ్బతిని పెట్టుబడులు కూడా పోగొట్టుకుంటున్నారు. కంటి రెప్పలా కాపాడుకున్న వరి పంట ఎండి పోవడంతో ఓ అన్నదాత పంటకు అగ్గి పెట్టిన విషాద కథ ఇది. తీవ్ర నష్టం వాటిల్లడంతో ఏమి చేయాలో తెలియక ఆవేదన చెందిన రైతు చివరకు తన పెంచిన పంటకు తానే నిప్పుపెట్టిన ఈ విషాదకర ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలం చామన్ పల్లికి చెందిన రైతు ఏలేటి శ్రీనివాస్ రెడ్డి తన రెండెకరాల పొలంలో సన్న రకం వరి సాగుచేశాడు.

    అయితే గతంలో దొడ్డు రకం వరి సాగు చేసినట్లు బాధిత రైతు శ్రీనివాస్ రెడ్డి తెలిపాడు. ఆ సమయంలో తనకు కాస్త లాభాలు వచ్చాయని వివరించాడు. ప్రభుత్వం సూచనలతో ఈ సారి అతను సన్న రకం వరి సాగు చేశాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటపొలంలో వర్షం నీరు నిలిచింది. దీంతో పంట దోమపోటుకు గురై ఎండిపోయింది. దీంతో తీవ్రంగా నష్ట వస్తుందని రైతు తీవర మనస్థాపానికి గురయ్యాడు. ఆ ఆవేదనతో ఎండిపోయిన వరి పంటకు నిప్పు పెట్టాడు. ప్రభుత్వం సహాయం చేసి తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Farmers Protest, Nirmal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు