హోమ్ /వార్తలు /తెలంగాణ /

Medak : మెదక్ జిల్లాలో పొలానికి పులి కాపలా.. కోతులకు చుచ్చు పోయిస్తున్న బెంగాల్‌ టైగర్

Medak : మెదక్ జిల్లాలో పొలానికి పులి కాపలా.. కోతులకు చుచ్చు పోయిస్తున్న బెంగాల్‌ టైగర్

( పులి బొమ్మతో కోతులకు చెక్)

( పులి బొమ్మతో కోతులకు చెక్)

Wise Farmer: వ్యవసాయం చేసే రైతులకు కష్టపడటమే కాదు..చేతికొచ్చిన పంటను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారింది. మెదక్ జిల్లాలో బయలు పంటలు సాగు చేస్తున్న రైతులకు కోతుల బెడద తప్పడం లేదు. అందుకే ఓ రైతు చేసిన ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చింది.

ఇంకా చదవండి ...

(K.Veeranna,News18,Medak)

ఏ రైతుకైనా పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పంటను కాపాడుకోవడం మరో ఎత్తు. ఎందుకంటే ఆరుగాలం శ్రమించి పండించిన పంట విలువ రైతులకు తెలుసు కాబట్టి ఆ పంటను కాపాడుకోవడం కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. విత్తన దశ దగ్గర నుంచి పంట దిగుబడి వచ్చే వరకూ పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటారు రైతులు. అయితే మెదక్(Medak)జిల్లాలోని మినుము, పెసర, బొప్పాయి వంటి పంటలు వేస్తున్నన్న రైతును కోతుల (Monkeys)బెడద తీవ్రంగా నష్టపరిచింది. కష్టపడి సాగు చేసిన పంట కోతుల పాలుకావడం ఇష్టలేకపోయిన రైతు..ఓ కొత్త ఆలోచనతో పంటను కాపాడుకుంటున్నాడు.

పంట కాపాడుకునే ప్రయత్నం..

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాంధారి పల్లి గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి అనే రైతు గత కొద్ది రోజులుగా బయలు పంటలు పెసర మినుము బొప్పాయి లాంటి పంటలు పండిస్తూ వస్తున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో కోతుల కారణంగా నేలపాలయ్యేది. ఈ పరిస్థితి కారణంగా రైతు దేవేందర్‌రెడ్డి తీవ్రంగా నష్టపోవడంతో ఎలాగైనా ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొనాలని భావించాడు. అందులో భాగంగానే తన వ్యవసాయ పొలం దగ్గర బొమ్మ పులిని పెడితే కోతులు భయపడి రావని భావించాడు.

కోతులకు పులితో చెక్..

అమెజాన్ లో 1600 రూపాయలు కట్టి పులిబొమ్మను పంట చేనులోపెట్టాడు. పులి బొమ్మను చూసి కోతులు పంట జోలికి, పొలం వైపుకు రావడం మానేశాయని రైతు దేవేందర్‌రెడ్డి సంతోషంగా తెలిపారు. నిజంగా పులి బొమ్మ ఉపాయం తనకు తట్టకపోతే పంట పూర్తిగా కోతుల పాలయ్యేదంటున్నారు రైతు. తానే కాదు చాలా మంది రైతులు కోతుల బెడదతో బయలు పంటలు వేయాలంటే భయపడిపోతున్నారని..ఇలాంటి సమస్యతోనే వెనకడుగు వేస్తున్నారని అంటున్నాడు.

Karimnagar: ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్‌ హాస్టల్ నుంచి బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారంట.. కారణం అదే



వర్కవుట్ అయిన రైతు ఐడియా..

పంట చేలపై పడుతున్న కోతులను ఒకవేళ కర్రలతో కొడుతుంటే అవి తిరిగి రైతులపైనే దాడి చేస్తున్నాయంటున్నారు. పులిలాంటి బొమ్మను పెట్టడం వల్ల కోతులు భయపడిపోయి చెట్లు ఎక్కుతున్నాయంటున్నారు. అయితే పులి బొమ్మను తీసుకెళ్తుంటే కోతులు గమనిస్తున్నాయని..అందుకే పులిబొమ్మను కదిలించకుండా ..వర్షానికి తడవకుండా తగిన ఏర్పాట్లు చేశారు రైతు దేవేందర్ రెడ్డి. ఒక్క బొమ్మ తీసుకొచ్చి పొలాల మధ్య పెట్టడం వల్ల తాము కావలి ఉండాల్సిన అవసరం లేకుండాపోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోతుల బెడదతో శాశ్వత పరిష్కారం లభిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Crime news : ప్రియుడే ముద్దు .. మొగుడు వద్దు కామారెడ్డి జిల్లాలో వివాహిత చేసిన దారుణం అంతా ఇంతా కాదు


First published:

Tags: Medak Dist, VIRAL NEWS

ఉత్తమ కథలు