Harish rao : రైతులకు శుభవార్త.. సొంత స్థలంలో డబుల్ నిర్మాణాలకు పదివేల కోట్లు.. !

Harish rao

Harish rao : రైతు రుణమాఫిపై మంత్రి హరీష్ రావు క్లారిటి ఇచ్చారు. వచ్చే మార్చి లోగా యాబైవేలకు పైగా ఉన్న రైతు రుణమాఫి చేస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే యాబై వేల లోపు ఉన్న రైతులకు రుణమాఫి చేసిన ప్రభుత్వం పూర్తిస్థాయి రుణాన్ని చెల్లించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

  • Share this:
    హుజూరాబాద్‌లో(huzurabad) అన్ని తానై ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి హరీష్ రావు రైతులకు శుభవార్త చెప్పాడు. గత అయిదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రైతు రుణాలను  (farmer loan waiver)పూర్తి స్థాయిలో చెల్లిస్తామని చెప్పారు. తాజాగా యాబై వేల రూపాయల వరకు ఉన్న రైతు రుణాలు ఇటివలే చెల్లించిన ప్రభుత్వం హామి ఇచ్చిన లక్ష రుపాయాల రుణమాఫిపై దృష్టి సారించినట్టు చెప్పారు. దీంతో రానున్న మార్చి వరకు యాబై వేల నుండి లక్ష రుపాయాలు ఉన్న రైతు రుణాలను వడ్డితో సహా బ్యాంకులో (bank) చెల్లిస్తామని చెప్పారు.

    మరోవైపు సొంత ఇంటి (double bed rooms)నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపోందించినట్టు ఆయన స్పష్టం చేశారు. సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం(state govt) శ్రీకారం చుట్టనుందని, ఇందుకోసం బడ్జెట్‌లో (budget)పదివేల కోట్ల రుపాయల కేటాయింపుల కోసం ప్రతిపాదనలు సిద్దం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ప్రతి నిరుపేదకు ఇళ్లు ఉండేలా చర్యలు చేపడతామని అన్నారు.

    ఇది చదవండి : అక్కడ అత్తను కొట్టి.. ఇక్కడ అత్యాచారం చేసిన సైదాబాద్ క్రిమినల్


    సిద్దిపేట జిల్లా(siddipet) హుస్నాబాద్ నియోజకవర్గంలో డబుల్ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సతీష్‌తో (mla sateesh)పాల్గొన్న హరీష్ రావు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.హుస్నాబాద్ లో అసంపూర్తిగా ఉన్న సమీకృత కార్యాలయాల సముదాయం ను 4 నెలల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలనీ పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణం లో ప్రగతిలో ఉన్న వెజ్ నాన్ వెజ్, రైతు బజార్, గిరిజన భవనం, డంప్ యార్డ్, లైబ్రరీ లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.ఇక స్థానిక జర్నలిస్టులకు కూడా హౌజింగ్ కాలని నిర్మిస్తామని ఆయన హమి ఇచ్చారు.

    ఇది చదవండి : కన్నీరు పెట్టిస్తున్న నవ వధువు సూసైడ్ నోట్.. ఎవ్వరినీ వదలొద్దు సార్ అంటూ లేఖ

    Published by:yveerash yveerash
    First published: