హోమ్ /వార్తలు /తెలంగాణ /

Murder: భార్యపై అనుమానం.. ఎంత దారుణానికి ఒడిగ‌ట్టాడో తెలుసా..? ఛీ.. ఛీ..

Murder: భార్యపై అనుమానం.. ఎంత దారుణానికి ఒడిగ‌ట్టాడో తెలుసా..? ఛీ.. ఛీ..

మల్లమ్మ

మల్లమ్మ

కత్తిపోట్లు, హత్యలు, ఆత్మహత్యలు, ఆగడాలు, దుర్మార్గాలు .. ఇలా ఒకటేమిటి.. దాదాపు ప్రతీ క్రైమ్‌ వెనుక మద్యం ప్రధాన పాత్ర పోషిస్తోంది.. ముఖ్యంగా తాగుబోతు భర్తల వల్ల భార్యలు బలైపోతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మహిళలపై హింస పెరగడానికి మద్యం ప్రధాన కారణం. తాగేది పురుషులే అయినా దాని ప్రభావం మహిళలపైనే ఉంటుంది. తాగుబోతు భర్త వల్ల మహిళ ఇంట్లో హింసకి గురౌతున్నది. మద్యం మత్తులో జరుగుతున్న దురాగతాలు. వేలాది కుటుంబాలను వీధి పాలు చేస్తోంది.. పిల్లలను అనాధలుగా మారుస్తోంది. మద్యపానం బారినపడి లక్షలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. తండ్రిని చంపిన తనయుడు, కొడుకుని చంపిన తండ్రి, భార్య పిల్లలను చంపిన భర్త, మద్యం మత్తులో గృహ దహనాలు, కత్తిపోట్లు, హత్యలు, ఆత్మహత్యలు, ఆగడాలు, దుర్మార్గాలు .. ఇలా ఒకటేమిటి.. దాదాపు ప్రతీ క్రైమ్‌ వెనుక మద్యం ప్రధాన పాత్ర పోషిస్తోంది.. ముఖ్యంగా తాగుబోతు భర్తల వల్ల భార్యలు బలైపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నాధులపూర్ గ్రామంలో జరిగిన దారుణం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

అనుమానమే హత్య చేసిందా..?

ఆందోల్ మండలం నాధులపూర్ గ్రామానికి చెందిన నారాయణ మద్యం మత్తులో తన భార్య మల్లమ్మను  పాశవికంగా గొడ్డలితో నరికి తాను సైతం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్నేళ్లుగా బతుకుదేరువు కోసం సిటీకి వెళ్లి జీవనం కొనసాగిస్తున్న భార్యాభర్తలు ఆదివారం నాడు బంధువుల ఇంట్లో శుభకార్యనికి వచ్చారు. మృతురాలి చెల్లెలి కూతురు వివాహానికి భార్యాభర్తలు కలిసి టేక్మాల్‌ మండలం అచ్చన్నపల్లికి వెళ్లారు. ఆ వేడుకలోనూ భార్యపై అనుమానంతో ఆమెతో భర్త గొడవపడ్డాడు. గతంలోనూ పలుమార్లు ఇలాగే గొడవలు జరగగా గ్రామస్థుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం దంపతులిద్దరు కలిసి స్వగ్రామమైన నాద్లాపూర్‌లోని సొంతింటికి వచ్చారు. ఆ ఇంటిని చూసుకుంటున్న అదే గ్రామానికి అంబమ్మను తన ఇంటికి పంపించారు. రాత్రి దంపతులిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఆగ్రహించిన నారాయణ భార్యను గొడ్డలితో నరికి హత్య చేశారు. ఉదయం పక్కింటి వాళ్ళు వెళ్లి చూసేసరికి నారాయణ ఇంట్లో దూలనికి ఉరివేసుకొని కనిపించగా పక్కనే భార్య మల్లమ్మ సైతం రక్తం మడుగులో విగతజీవిగా పడి ఉంది. గ్రామస్థుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జోగిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మద్యానికి బానిస.. అందులో అనుమానం:

మద్యానికి బానిసైన తన తండ్రి అనునిత్యం భార్య మల్లమ్మపై అనుమానంతో కొట్టేవాడని నారాయణ-మల్లమ్మ కుమారుడు చెబుతున్నాడు. ఊరికి దూరంగా ఉంటే పరిస్థితులు మారుతాయేమోనని అక్కడ నుంచి సిటీకి వచ్చామన్నాడు. అయినా కూడా తండ్రి తీరు మారలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరికి తన తల్లిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని కుమారుడు వాపోయాడు. ఇద్దరు కలిసిన తనను అనాథను చేసేరాని విలపించాడు.

First published:

Tags: Husband kill wife, Medak Dist, Murder, Sangareddy

ఉత్తమ కథలు