వరికుప్పపై ప్రాణాలు విడిచిన రైతు... తెలంగాణలో విషాదం...

Telangana News : తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని టీఆర్ఎస్ చెప్పుకుంటోంది. మరి అలాంటి ప్రభుత్వ పాలనలో ఆ రైతు ఎందుకు చనిపోయాడు. తప్పు ఎవరిది...?

Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 12:08 PM IST
వరికుప్పపై ప్రాణాలు విడిచిన రైతు... తెలంగాణలో విషాదం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కోట్ల మంది రైతుల లాగే... ఆ పెద్దాయన కూడా... కష్టపడి వరి పంట పండించాడు. చేసిన అప్పులు వెంటాడుతున్నాయి. పంటను అమ్మి... అప్పులు తీర్చేద్దామనీ, భార్యా, పిల్లలను చక్కగా చూసుకుందామనీ ఎన్నో కలలుకన్నాడు. ఎప్పట్లాగే ప్రకృతి కన్నెర్ర జేసింది... అదే సమయంలో అధికారులు పట్టించుకోలేదు... మృత్యువు వెంటాడుతుంటే... దిక్కులేని పరిస్థితుల్లో ఆ రైతన్న ప్రాణాలు విడిచాడు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా... ఈ విషాద ఘటనకు సాక్ష్యమైంది. జిల్లాలోని లక్ష్మాపూ‌ర్‌లో వరి పంట వేశాడు 50 ఏళ్ల గోపాల్. పంట చేతికొచ్చింది. వరికుప్పను సిద్ధం చేశాడు. ఇక అమ్మేయడమే మిగిలి ఉంది. ఇంత కష్టపడి, ఇంత శ్రమిస్తే... అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఐదు రోజులుగా ఎదురుచూసినా... పంట కొనేందుకు రాలేదు.

అధికారుల కోసం ఎదురు చూసీ చూసీ, పంట అమ్ముడవ్వట్లేదన్న ఆవేదన ఆ రైతు మనసులో పెరిగిపోయింది. అదే సమయంలో ఎండల తీవ్రత ఎక్కువైంది. వడగాలులు వీపరీతంగా వీచాయి. అంతే... వరికుప్పపైనే కళ్లు తిరిగి పడిపోయాడు. దురదృష్టమేంటంటే... ఆ ఎండ సమయంలో అక్కడ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆయన పడిపోయిన విషయం ఎవరికీ తెలియలేదు. తెల్లారి కుటుంబ సభ్యులు పొలంలోకి వెళ్లారు. వరికుప్పపై పడివున్న గోపాల్‌ని చూశారు. ఆయన్ని కదిపిన క్షణం వాళ్లలో తెలియని ఆందోళన మొదలైంది. ఎంత కదిపినా అచేతనంగా ఉండటంతో... గుండెల్లో ఆవేదన అనంత సాగరమైంది.

గోపాల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అంతే... ఆ కుంటుంబం కన్నీటి సంద్రమైంది. గోపాల్ చనిపోవడానికి వ్యవసాయ అధికారులే కారణమనీ, వాళ్లు వెంటనే పంటను కొనివుంటే చనిపోయేవాడు కాదని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ అధికారులు మాత్రం తమకెలాంటి సంబంధమూ లేదని అంటున్నారు. అసలు పంటను కొంటామని తాము చెప్పనే లేదని వాదిస్తున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఏం తేలినా... ఓ రైతు ప్రాణమైతే పోయింది. అసలీ పరిస్థితి మారేదెప్పుడు. అన్నం పెట్టే రైతన్నకు ఎందుకీ కష్టాలు...

 ఇవి కూడా చదవండి :

అమెరికాలో విద్యార్థులపై కాల్పులు.. గిటార్‌ లోంచీ గన్స్ తీసి...

చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన రాహుల్ గాంధీబీజేపీ గెలిచినా... కేంద్రంలో అధికారంలోకి రాదా...? ఆ 21 పార్టీల ప్లాన్ ఏంటి...?

యూపీలో బీజేపీకి షాక్ తప్పదా... మారుతున్న పరిస్థితులు... పెరుగుతున్న పార్టీల వ్యతిరేకత...
First published: May 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు