హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gajwel : సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో ప్రమాదవశాత్తు వ్యవసాయ కూలి మృతి.. ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన

Gajwel : సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో ప్రమాదవశాత్తు వ్యవసాయ కూలి మృతి.. ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన

వ్యవసాయంపై సీఎం కేసీఆర్ సమీక్ష

వ్యవసాయంపై సీఎం కేసీఆర్ సమీక్ష

Gajwel : సీఎం కేసిఆర్ ఫామ్‌హౌజ్‌లో కూలీకి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. అయితే ఆ వ్యక్తికి ఎలాంటీ నష్టపరిహారం కల్పించక పోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు గజ్వేల్‌లోని కేసిఆర్ ఫామ్‌హౌజ్ కు కొద్ది దూరంలో ఆందోళన చేపట్టారు.

ఇంకా చదవండి ...

( medak veereanna news 18 telugu )

ఎర్రవల్లి లోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో వ్యవసాయ పనుల కోసం కూలికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన మంగళవారం జరిగినట్టు సమాచారం. ఫాంహౌజ్‌కు నిత్యం వ్యవసాయ పనుల కోసం కూలీలు వెళుతుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం సైతం ఎర్రవల్లి గ్రామం పక్కనే ఉన్న వరదరాజపూర్ గ్రామానికి చెందిన అంజనేయులు అనే వ్యక్తి పనుల కోసం వెళ్లాడు. ఫామ్‌హౌజ్‌లో చెట్లపొదలను తొలగిస్తూ పక్కనే ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడినట్టు తెలుస్తోంది. అది గమనించిన తోటి కూలీలతో పాటు సెక్యూరిటి సిబ్బంది అంజనేయులును బయటికి తీశారు. అయితే అప్పటికే ప్రాణాలు కొల్పోయినట్టు తెలుస్తోంది. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కాని ఎలాంటీ స్పందన రాకపోవడంతో నేడు ఫాం హౌజ్‌కు కొద్ది దూరంలో అంజనేయులు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తోంది... అయితే పోలీసులు ఎవరిని సంఘటన స్థలానికి అనుమతించడం లేదని సమాచారం.

Breaking : మాజి సర్పంచ్‌ను హతమార్చిన మావోలు.. పోలీసు ఇన్‌ఫార్మర్ అంటూ లేఖ .. 20న కిడ్నాప్..


Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: CM KCR, Gajwel, Medak

ఉత్తమ కథలు