ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్రభారతి వేసిన పిటీషన్ ను కొట్టేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ దశలో ఉన్న ఈ కేసులో జోక్యం చేసుకోలేమని సుప్రీం (Supreme Court) అభిప్రాయపడింది. అయితే పిటీషనర్ హైకోర్టు (High court)ను ఆశ్రయించే హక్కు ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. అలాగే హైకోర్టు (High court) తీర్పుపై సుప్రీం (Supreme Court) అభ్యంతరం వ్యక్తం చేసింది.
కేరళలో సోదాలు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సిట్ బృందం కేరళ (Kerala) వెళ్లిన విషయం తెలిసిందే. కేరళ (Kerala)లో విచారణ పూర్తి చేసుకున్న సిట్ బృందం హైదరాబాద్ కు చేరుకున్నారు. దాదాపు 5 రోజుల పాటు సిట్ బృందం కేరళలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కేరళ (Kerala)లో డాక్టర్ జగ్గుజీస్వామి కోసం సిట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ సిట్ బృందం కేరళ (Kerala)కు వస్తుందన్న విషయం తెలుసుకున్న జగ్గుజి అనే డాక్టర్ పారిపోయాడు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ దాఖలు చేసిన పిటీషన్ పై ఇటీవల తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు (Telangana High Court) ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి నిరాకరించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగించాలని కొన్ని కండీషన్స్ పెట్టింది కోర్టు. ఈ కేసును సిట్ చీఫ్ సీవీ ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు చేయాలి.
అలాగే దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి విషయాలను అటు మీడియా, ఇటు రాజకీయ నాయకులకు వెల్లడించవద్దని హైకోర్టు తెలిపింది. దర్యాప్తుకు సంబంధించి పురోగతి నివేదికను ఈనెల 29న హైకోర్టు (Telangana High Court) ముందు ఉంచాలని కోర్ట్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నేడు విచారణకు హాజరు కావాలని శ్రీనివాస్, సంతోష్, తుషార్, జగ్గూజికి సిట్ నోటీసులు పంపించింది. కానీ విచారణకు కేవలం శ్రీనివాస్ మాత్రమే హాజరు అయినట్లు తెలుస్తుంది. మరి మిగతా వారి గైర్హాజరుపై సిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Supreme, Supreme Court, Trs, TRS MLAs Poaching Case