టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయింది. నిందితులు రామచంద్రభారతి (Ramachandra Bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji)లకు బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఒకవేళ నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ కు నిరాకరించింది.
ఇక ఫామ్ హౌజ్ డీల్ కేసుకు సంబంధించి మరో ఇద్దరు శరత్, ప్రశాంత్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వీరిద్దరూ కీలకం కానున్నట్లు తెలుస్తుంది. శరత్, ప్రశాంత్ ను అదుపులోకి తీసుకొని అక్కడే పోలీసు కమిషనరేట్ లో తెలంగాణ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే కొచ్చిన్ కు చెందిన జగ్గూజి అనే మరో స్వామిజి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తుషార్ కు, జగ్గూజికి మధ్య సంబంధాలపై, అలాగే ఆర్ధిక లావాదేవీలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇప్పటికే నిందితుల్లో ఒకరైన నందకుమార్ (Nandakumar) హోటల్ ను జేసీబీలతో కూల్చివేశారు. ఫిల్మ్ నగర్ లోని డెక్కన్ కిచెన్ హోటల్ ను భారీ పోలీసు బందోబస్తు మధ్య హోటల్ ను నేలమట్టం చేశారు. ఓ వైపు హోటల్ కూల్చివేస్తూనే మరోవైపు సిట్ అధికారులు ఏపీ, హర్యానా , కేరళ , కర్ణాటకతో పాటు హైదరాబాద్ (Hyderabad) లో సోదాలు జరిపారు. హైదరాబాద్ లో నందకుమార్ (Nandakumar) ఇళ్లలో సోదాలు చేపట్టగా..తిరుపతిలోని సింహయాజి (Simhayaji) ఆశ్రమంలో సిట్ తనిఖీలు చేశారు. ఇక హర్యానా, కర్ణాటకలో రామ చంద్ర భారతి (Rama chandra bharathi) ఇళ్లలోనూ రైడ్స్ జరిగాయి. అలాగే కేరళలో ఓ డాక్టర్ ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. ఈ డాక్టర్ రామచంద్రభారతికి మధ్యవర్తిత్వంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డాక్టర్ కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ కేసులో A2 గా ఉన్న నందకుమార్ (Nandakumar) డెక్కన్ కిచెన్ హోటల్ ను భారీ పోలీసు బందోబస్తు మధ్య హోటల్ ను నేలమట్టం చేశారు. ఓ వైపు హోటల్ కూల్చివేస్తూనే మరోవైపు సిట్ అధికారులు ఏపీ, హర్యానా, కేరళ, కర్ణాటకతో పాటు హైదరాబాద్ (Hyderabad) లో సోదాలు జరిపారు. అయితే ఈ సోదాల్లో వారికీ కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కేరళలో ఇంకా రైడ్స్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.