భాజా భజంత్రీలతో కుక్క ఖననం

కుక్కను గత 15 సంవత్సరాల నుంచి అల్లారుముద్దుగా చంటి పిల్లలాగా ఇంట్లో పెంచుకుంటున్నారు. ఆ కుక్క వారం రోజుల క్రితం ఆనారోగ్యానికి గురయింది.

news18-telugu
Updated: August 4, 2019, 9:56 PM IST
భాజా భజంత్రీలతో కుక్క ఖననం
కుక్కకు అంత్యక్రియలు
  • Share this:
అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క ఆనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రామోజు చక్రపాణి, శోభ దంపతులు. ఓ పెంపుడు కుక్కను గత 15 సంవత్సరాల నుంచి అల్లారుముద్దుగా చంటి పిల్లలాగా ఇంట్లో పెంచుకుంటున్నారు. ఆ కుక్క గత వారం రోజుల నుంచి ఆనారోగ్యానికి గురయింది. స్థానిక పశు ఆస్పత్రికి ఆ కుటుంబ సభ్యులు తీసుకవెళ్లారు. అయితే, ఆ కుక్క అల్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్ తెలిపింది. దానికి ఇంజక్షన్ చేసి మందులు కూడా ఇచ్చిన నయం కాలేదు. ఈ క్రమంలో ఆదివారం కుక్క చనిపోయింది. కుక్క మరణవార్త విన్న ఆ కుటుంబ సభ్యులు చక్రపాణి, శోభ, శేఖర్, అంజలి, ప్రవీణ్ బోరున విలపించారు. ఆనంతరం గిద్దచెరువు శ్మాశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కుక్కకు పూల మాలలు వేసి పసుపు, కుంకుమతో ఆలకరించి భాజాభజంత్రీలతో తీసుకువెళ్ళి ఖననం చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 4, 2019, 9:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading