హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కానిస్టేబుల్‌ అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు..మరో ఐదుగురికి పునర్జన్మ

Telangana: కానిస్టేబుల్‌ అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు..మరో ఐదుగురికి పునర్జన్మ

(ప్రాణదాత)

(ప్రాణదాత)

Telangana:ఆతనో రక్షకుడు. ప్రాణాలతో ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా అతను రక్షకుడే అని నిరూపించారు ఓ పోలీస్‌ కుటుంబ సభ్యులు. చావు,బతుకుల మధ్య ఉన్న తమ కటుంబ సభ్యుడి అవయవాలను వేరే వారికి దానం చేసి మరో ఐదుగురికి పునర్జన్మ ప్రసాధించారు.

ఇంకా చదవండి ...

ఆతనో రక్షకుడు. ప్రాణాలతో ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా అతను రక్షకుడే అని నిరూపించారు ఓ పోలీస్‌ కుటుంబ సభ్యులు. నల్లగొండ జిల్లాకు చెందిన బత్తుల విజయ్‌కుమార్ చనిపోయి కూడా మరో ఐదుగురి పాలిట ప్రాణదాతగా మారాడు. నల్లగొండ(Nallagonda)జిల్లా నాగార్జునసాగర్‌(Nagarjunasagar)‌కి చెందిన విజయ్‌కుమార్‌( Vijay Kumar)కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 6వ తేదిన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు విజయ్‌కుమార్. తలకు బలమైన గాయం కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌(Hyderabad)లోని మలక్‌పేట యశోద ఆసుపత్రిYashoda Hospitalకి తరలించారు. అప్పటికే విజయ్‌కుమార్ బ్రెయిన్‌ డెడ్(Brain Dead)అయినట్లు డాక్టర్లు తేల్చారు. విజయ్‌కుమార్‌ బ్రతికే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల పాటు ఇన్టెన్సివ్ కేర్ యూనిట్‌Intensive care unit‌లో ఉంచిన ప్రయోజనం లేకపోవడంతో మృత్యువు ముంగిట ఉన్న విజయ్‌కుమార్‌ శరీరంలోని అవయవాలను దానం Organ donationచేయాలని భావించారు. విజయ్‌కుమార్, గుండె(Heart),రెండు కిడ్నీలు, (two kidneys),లివర్(liver),ఉపిరితిత్తులు (lungs) ఓ స్వచ్చంద సంస్థ ద్వారా దానం చేసి తమ గొప్ప మనసును చాటుకున్నారు. విజయ్‌కుమార్‌ అవయవాలను గ్రీన్‌ చానెల్ (Green Channel)ద్వారా సేకరించిన డాక్టర్లు గుండెను జూబ్లిహిల్స్‌(Jubileehills)‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. మలక్‌పేట యశోధ ఆసుపత్రి నుంచి జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రి(Apollo Hospital)కి కేవలం 14నిమిషాల్లో గుండెను చేరవేశారు. 13కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్స్‌ ద్వారా అతి తక్కువ సమయంలో తరలించి 51సంవత్సరాలు కలిగిన మరో వ్యక్తికి కానిస్టేబుల్ విజయ్‌కుమార్‌ గుండెను అమర్చారు. విజయ్‌కుమార్‌ గుండెను బుధవారం ఉదయం 11గంటలకు ఆసుపత్రికి తెచ్చిన వైద్యులు సాయంత్రం ఆరు గంటలకు ఆపరేషన్‌ చేసి అమర్చారు.

అవయవాలు దానం..

కానిస్టేబుల్‌ విజయ్‌కుమార్‌ శరీరంలోని మిగిలిన అవయవాలను సైతం వేర్వేరు ఆసుపత్రుల్లో ఉన్న రోగులకు అమర్చారు డాక్టర్లు. విజయ్‌కుమార్ బ్రతకడని తెలిసి అతని అవయవాలు వేరే వాళ్లకు దానం చేయడం వల్ల వాళ్లకు పునర్జన్మ ప్రసాధించినట్లు అవుతుందని కుటుంబ సభ్యులు ఆలోచించడం అభినందనీయమని జీవన్‌దాన్‌ స్వచ్చంద ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. మరోవైపు కేవలం 13నిమిషాల్లో గుండెను అపోలోకి చేర్చడంలో ట్రాఫిక్ జామ్‌ కాకుండా పోలీస్‌ సిబ్బంది ప్రయత్నించినట్లు సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.

రక్షకుడిగా మారిన రక్షకభటుడు..

నల్లగొండ 12వ పోలీస్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించాడు విజయ్‌కుమార్. 32సంవత్సరాల విజయ్‌కుమార్‌కి ఐదేళ్ల క్రితం వేముల చంద్రకళతో వివాహం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్‌కుమార్‌ అవయవాలు దానం చేసి కుటుంబ సభ్యులు కూడా తమ గొప్ప మనస్తత్వవాన్ని చాటుకున్నారని డాక్టర్లు, పోలీసులతో పాటు జీవన్‌ధాన్‌ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

First published:

Tags: Nalgonda police, Organs

ఉత్తమ కథలు