(K.Lenin,News18,Adilabad)
కొమురంభీం ఆసిఫాబాద్(Komurambhim Asifabad)జిల్లా పెంచికల్ పేట్(PenchikalPate) మండలంలోని ఏళ్ళూరు(Elluru)ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఆలం రాజేష్(Alam Rajesh)జ్వరంతో మృతి చెందాడు. సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే విద్యార్థి మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద విద్యార్థి మృతదేహంతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. మృత దేహాంతో జాతీయ రహదారిపై బైఠాయించారు. విద్యార్థి సంఘాలు కూడా మృతుడి కుటుంబ సభ్యులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
నిర్లక్ష్యంపై మంత్రి స్పందన..
పెంచికల్‌పేట్ మండలంలోని ఏళ్లూరు గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాడు ఆలం రాజేశ్. గత మూడు రోజుల నుండి జ్వరంతో బాధపడుతుంటే హాస్టల్ వార్డెన్, సిబ్బంది పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో స్టూడెంట్ మృతి చెందాడు. విద్యార్థి మృతికి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు మృతదేహంతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి చెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు.
తల్లిదండ్రులు జాగ్రత్తపడ్డా దక్కని ప్రాణం..
విద్యార్ధి కండీషన్ బాగోకపోవడంతో తల్లిదండ్రులు హాస్టల్ నుండి ఇంటికి తీసుకు వెళ్లారు. జ్వరం ఎక్కువ కావడంతో మంగళవారం కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అప్పుడుప్రధానోపాధ్యాయుడు, వైద్యాధికారులు విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారని పేర్కొన్నారు. ఐటిడిఎ ద్వారా వైద్య ఖర్చులను అందించడంతోపాటు, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వలన రెండు బ్లడ్ యూనిట్స్ ను కూడా అందించినట్లు తెలిపారు. హిమోగ్లోబిన్, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండడం వలన వైద్యుల సూచన మేరకు తల్లిదండ్రులు అత్యవసర చికిత్సలకు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించడంతో మార్గమధ్యంలోనే విద్యార్థిని మృతి చెందాడు. ఈఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని ప్రకటించారు. ప్రభుత్వపరంగా మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి.
జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు..
ఉట్నూరులోని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డితోపాటు సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్ విద్యార్థుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. విద్యార్థులు జ్వరం భారిన పడితే మెరుగైన చికిత్స అందించడంతోపాటు తప్పనిసరిగా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. వర్షాకాలం సమయంలో విద్యార్థిలకు అందించే ఆహారం, నీటితోపాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asifabad, Hostel students, Telangana News