HYDERABAD : ఈటల రాజేందర్‌నే బర్తరఫ్ చేయించిన వాళ్లం అంటూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో హల్‌చల్ చేసిన అధికారుల గ్యాంగ్

ఈటల రాజేందర్‌నే బర్తరఫ్ చేయించిన వాళ్లం అంటూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో హల్ చేసిన అధికారుల గ్యాంగ్

crime : క్రైం ఇన్వేస్టిగేషన్ పేరుతో ప్రభుత్వ డాక్టర్లను , సిబ్బందిని ఓ ఆట ఆడుకున్నారు. కొంతమంది అధికారులుగా వచ్చి ఆసుపత్రి అంతా కలియతిరుగుతూ..అందరిని భయభ్రాంతులకు గురి చేశారు.మరోవైపు అడ్డువచ్చివారిని హెచ్చరిస్తూ.. తామేవరో మీకు తెలియదు అంటూ.. ఈటల రాజేందర్‌ను సైతం బర్తరఫ్ చేయించిన కేపాసిటి మాదంటూ రెచ్చిపోయారు ఆధికారులు కాని ఆ.. అధికారులు.

  • Share this:
అసలే కరోనా ఆపై వైద్యులు ఇంటికి వెళ్లకుండా బిక్కుబిక్కుమంటూ రోగులకు వైద్యం చేస్తున్నారు. దీనికి తోడు ఆక్సిజన్ సమస్య వైద్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే..మరోవైపు ఇతర వ్యక్తులు బెదిరింపులు తోడయ్యాయి. వైద్యలంతా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు వైద్యులను ఎటు తేల్చుకోలేకుండా చేస్తున్నాయి..ఆసుపత్రిలో వైద్యులకు సంబంధం లేకుండా అడ్మినిస్ట్రేషన్ లోపాలను కూడ వైద్యులను కారణం చేసి నిందించడం రివాజుగా మారింది. ఈ నేపథ్యంనే ప్రజలు సైతం వైద్యులంటే ఓకింత వ్యతిరేకత భావం ఏర్పడుతుంది. ఆసుపత్రుల్లో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో పెల్లుబికుతున్న వ్యతిరేకతను కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇదే పేరుతో వైద్యులను బెదిరిస్తూ..హంగామా చేస్తున్నారు.తాజాగా ఇలాంటీ ముఠా ఒకటి హైదరాబాద్‌లో పట్టుబడింది.

ఇటివల కింగ్‌కోటి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకు ముగ్గురు కరోనా పేషంట్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే..ఈ విషయం జరిగిన తర్వాత రెండు రోజులకు కింగ్‌కోటి ఆసుపత్రిలోకి ఓ ముఠా సభ్యులు క్రైం ఇన్వేస్టిగేషన్ పేరుతో ఎంటర్ అయ్యారు..అనంతరం ఆసుపత్రి సూపరిండెంట్ నుండి ఇంచార్జ్ వరకు అందరిని హడల్ ఎత్తించారు. ఏకంగా ఐసీయూలోకి వెళ్లి వీడియోలు ఫోటోలు తీస్తూ.. అక్కడి ఇంచార్జులను దుర్భశలాడారు. ఎదురు వచ్చిన వైద్యులను అంతు చూస్తామని బెదిరించారు. ఆసుపత్రిలో లంచం లేనిదే..పని జరగడం లేదని వైద్యులపై చిర్రుబుర్రులాడారు. ఇలా రెండు గంటల సేపు ఆసుపత్రిలో హల్ స‌ృష్టించారు

ఇంతకి వీళ్లు ఎవరు .. ఇలా ఎందుకు చేశారు.. ? ఏం కావాలనే దానికి మాత్రం సమాధానం రాలేదు. ఇదంతా చేసింది డబ్బుకోసమైతే..పర్వాలేదు..ఇంత చేసిన డబ్బు కూడ ఎక్కడ డిమాండ్ చేయలేదు..చుడ్డానికి అచ్చు ప్రభుత్వ అధికారులు, అవినీతిని అంతం చేసే వీర సైనికుల్లా కనిపించారు.అనుమానంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని కూడ బెదిరించారు. మా సంగతి మీకు తెలియదంటూ హెచ్చరించారు. మేం తలచుకుంటే ఇక్కడ ఎవ్వరు ఉద్యోగం చేయరంటూ పోలీసుల ముందే ఆవేశంతో ఊగిపోయారు. చివరకు పోలీసు ఉన్నతాధికారులు రంగప్రవేశం చేసి విచారణ చేశాక ముఠా సభ్యులు కటటాలపాలు అయ్యారు.

వీళ్లంతా ఎవరు
నగరంలోని డబీర్‌పురకు చెందిన మహ్మద్ తస్కీన్ ఆలిండియా సీనియర్ స్పెషల్ ఆఫిసర్స్ ప్రెసిడెంట్‌గా మెట్టుగూడకు చెందిన అమరేందర్ అనే వ్యక్తి సెక్రటరీగా యూనిట్ ఫర్ క్రైం ఇన్వేస్టిగేషన్ టీం [ యూసిఐడి ] పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. దీన్ని రిజిస్టర్ చేసేందుకు కూడ ధరఖాస్తు చేసుకున్నారు. అది ఇంకా రిజిస్ట్రేషన్ కాకముందే..స్వంత ఐడి కార్డులు సృష్టించి, విజిటింగ్ కార్డులు సైతం ముద్రించుకున్నారు. వీరంతా అవినీతి అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే దందాకు తెరతీశారు. అయితే వైద్య సిబ్బంది మేలుకోవడంతో ముఠా గుట్టు రట్టయింది.
Published by:yveerash yveerash
First published: