Karimnagar : కోట్ల బంగారం...లక్షల రూపాయలే...అశపడి భంగపడ్డ వ్యాపారి...!

Karimnagar : కోట్ల బంగారం...లక్షల రూపాయలే...అశపడి భంగపడ్డ వ్యాపారి...!

Karimnagar : రెండు కోట్ల రూపాయల బంగారం ముప్పై అయిదు లక్షలకే అమ్ముతున్నామంటే ఆశపడినా వ్యాపారి. కొనుగోలు అనంతరం లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగులు...అలర్ట్ అయినా పోలీసులు నిందితులను ఆరెస్ట్ చేశారు.

  • Share this:
    కరీంనగర్ జిల్లా.న్యూస్18తెలుగు కారస్పాండెంట్. శ్రీనివాస్. పి

    బంగారం వ్యాపారుల అత్యాశను కొంతమంది కేటుగాళ్లు సోమ్ము చేసుకున్నారు..అసలు వస్తువులను చూయించి వ్యాపారులను బురిడి కొట్టిస్తున్నారు...దీంతో అత్యాశకు పోయిన బంగారం వ్యాపారుల కోట్ల రూపాయలు కష్టపడకుండానే వస్తున్నాయనే దురుద్దేశ్యంతో కేటుగాళ్ల వలలో పడి మోసపోయిన సంఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో చోటు చేసుకుంది.

    వివరాల్లోకి వెళితే...నకిలీ బంగారం తో మోసం చేస్తూ లక్షలో దోపిడీ చేస్తున్న గుజరాత్, రాజస్థాన్ ముఠా.. ప్రజలను మోసం చేస్తున్న నకిలీ బంగారం విక్ర యిస్తున్న ముఠాను హుజూరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు . రాజస్థాన్‌కు చెందిన గంగారాం అలి యాస్ రమేశ్ ప్రజాప్రతి , గుజరాత్ రాష్ట్రానికి చెందిన అర్జున్ కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నకిలీ బంగారంతో తిరుగుతూ ప్రజలను మోసం చేస్తున్నారు . ఈ క్రమంలోనే హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యాపారి వద్దకు వచ్చారు . తమ వద్ద రెండు కిలోల బంగారం ఉందని , బయట దీని విలువ రూ .2 కోట్లు ఉందని , మీకు రూ .50 లక్ష లకు విక్రయిస్తామని నమ్మించారు

    దీంతో ఆ వ్యాపారి బంగారాన్ని పరీక్షించి , రూ .35 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు . ఫిబ్రవరి 2 న మానకొండూరు మండలంలో వారికి ఆ మొత్తాన్ని ముట్టజెప్పి , బంగారు గొలుసులు కొనుగోలు చేశాడు . మరుసటి రోజు తీసుకున్న బంగారం గొలుసులను పరీక్షించగా నకిలీవని తేలడంతో బాధితుడు లబోది
    బోమంటూ పోలీసులను ఆశ్రయించాడు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందుతులను పట్టుకునేందుకు సోషల్ మీడియాను వాడుకున్నారు. నిందితుల ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు.. ఈ క్రమంలోనే కేశవపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో రమేశ్ ప్రజాపతిని స్థానికులు గుర్తించారు .

    నిందితుల సమచారాన్ని పోలీసులకు చేరవేయడంతో రమేశ్‌ ప్రజాపతి అనే నిందితున్ని జిల్లా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మరో నిం దితుడు అర్జున్ పరారీలో ఉన్నాడు . రమేశ్ ప్రజాపతి నుండి నకిలీ బంగారు గొలుసులు , రూ.లక్ష స్వాధీనం చేసుకున్నట్లు ఐపీఎస్ రితిరాజ్ తెలిపారు .

    ఈ సంధర్బంగా ప్రజలు బంగారానికి ఆశపడి మోసపోవ ద్దని ఆయన సూచించారు . అత్యాశ చూపిస్తున్న వారి వివరాలను పోలీసులకు ఇవ్వాలని సూచించారు. కాగా నిందితులను కొద్ది రోజుల్లోనే పట్టుకున్న పోలీసుల బృందాన్ని సీపీ కమలహాసన్ రెడ్డి అభినందిం
    Published by:yveerash yveerash
    First published: